
సాక్షి, బెంగళూరు (ఉడిపి) : బాహుబలి చిత్రానికి తన చిన్నతనంలో నానమ్మ చెప్పిన రామాయణం, మహాభారతం కథలే స్ఫూర్తి అని ఆ సినిమా దర్శకుడు రాజమౌళి తెలిపారు. ఉడిపిలోని మణిపాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో రాజమౌళి శనివారం విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ఎక్కువగా ఫాంటసీ, క్రైమ్‌తో కూడిన పుస్తకాలను ఎక్కువగా చదివేవాడని, అందుకే ఆ తరహా చిత్రాలు తీయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తానన్నారు.