
భారతీయ సినిమా స్టామినాను ప్రపంచానికి చాటిచెప్పిన చిత్రం బాహుబలి. ఎస్‌ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ దృశ్యకావ్యం ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. తాజా జపాన్, రష్యన్ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ నెల 29న జపాన్‌లో, జనవరి నెలలో ఈ సినిమా రష్యాలో విడుదల కానుంది.
దాదాపు ఐదేళ్లు కష్టపడి రాజమౌళి బృందం తెరకెక్కించిన 'బాహుబలి' సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంది. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమా మొదటిభాగం 2015లో, రెండోభాగం 2017లో విడుదలైన సంగతి తెలిసిందే. భారతీయ సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా 'బాహుబలి' ఘనత సొంతం చేసుకుంది. బాహుబలి సినిమాతో రాజమౌళి తెలుగు సినిమా సత్తాని ఇటు దేశానికి, అటు ప్రపంచానికి చాటిచెప్పారు. బాహుబలి-2 ఇప్పుడు జపాన్, రష్యాలో కూడా రికార్డుల వేటకు సిద్ధమైంది.
Comments
Please login to add a commentAdd a comment