
దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో హాలోవీన్ వేడుకలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ వేడుకలో దాదాపు 150పైగా ప్రజలు మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో యువ గాయకుడు, నటుడు లి జి హాన్(24) కూడా మృతి చెందారు. లి జి హాన్(Lee Ji-han) మృతితో దక్షిణ కొరియా సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అక్టోబర్ 29న సియోల్‌లో జరిగిన హాలోవీన్ వేడుకల్లో జరిగిన తొక్కిసలాటలో ఈ యంగ్ పాప్ సింగర్ మరణించినట్లు అక్కడి స్థానిక మీడియా ఆదివారం వెల్లడించింది.
చదవండి: సమంత అనారోగ్యంపై స్పందించిన మరో అక్కినేని హీరో, వెంకటేశ్ కూతురు
లీ జీ హాన్ మృతిపై కొరియాకు చెందిన పలువురు నటీనటులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. కాగా రాజధాని నగరం సియోల్‌లో రద్దీగా ఉండే నైట్ లైఫ్ జిల్లా ఇటావాన్‌లో శనివారం(అక్టోబర్ 29న) హాలోవీన్ వేడుకులను నిర్వహించారు. ఈ వేడుకకు భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ క్రమంలో అక్కడి ఇరుకైన వీధుల్లోంచి జనం ఒక్కసారిగా పోటెత్తడంతో తొక్కిసలాట సంభవించింది. ఈ ఘటనలో ఊపిరాడక దాదాపు 154పైగా మంది మరణించారు. అందులో ఈ యువ గాయకుడు లీ జీ హాన్ ఒకరు.
Comments
Please login to add a commentAdd a comment