Halloween Festival
-
హంతకుని గెటప్‌లో మార్క్ జుకర్‌బర్గ్ (ఫోటోలు)
-
అమెరికాలో అట్టహాసంగా హాలోవీన్ వేడుకలు
-
అస్తిపంజరం డ్యాన్స్ చేస్తున్న దృశ్యాలను మీరెప్పుడైనా చూశారా?
దేవుడున్నాడన్నది ఎంత నిజమో దెయ్యాలు ఉన్నాయన్నది కూడా అంతే నిజం. కూడా దెయ్యాలకూ కొన్ని స్పెషల్ డేస్ ఉంటాయి. అదే హలోవీన్ ఫెస్టివల్. ఈ పండగను పురస్కరించుకొని రకరకాల వికృత వేషాలు చూస్తుంటాం. తాజాగా దుబాయ్‌లో అస్తిపంజరం డ్యాన్స్ చేస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది. భారతీయ సాంప్రదాయంలో పలు పండగలకు ప్రత్యేకమైన విశిష్టతలున్నాయి. అదే విధంగా దెయ్యాలకూ స్పెషల్‌గా పండగలున్నాయి. అదేనండీ మన హలోవీన్ పండగ. ఐర్లాండులో పుట్టిన ఈ పండగ తర్వాతి రోజుల్లో ప్రపంచ దేశాలకూ పట్టింది. హాలోవీన్ అనే స్కాట్లాండ్ పదం ఆల్ హాలో ఈవ్ నుంచి వచ్చింది. 1846లో ఏర్పడిన తీవ్రమైన కరువు కారణంగా ఉత్తర అమెరికాకు వలస వెళ్లిన ఐర్లాండు ప్రజలు.. ఈ సంప్రదాయాన్ని పరిచయం చేశారు. దీన్ని సాంహైన్ పండుగ అని కూడా అంటారు. 2,000 సంవత్సరాల కిందట ఐర్లాండ్, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్‌లోని కొన్ని ప్రాంతాలలో నివసించిన సెల్ట్స్ జాతి ప్రజలు నవంబరు 1ని కొత్త సంవత్సరంగా జరుపుకునేవారు. దానికి ఒకరోజు ముందే హాలోవీన్ వేడుకలు నిర్వహించే సంప్రదాయం కొనసాగుతోంది.పండుగ రోజున మంటలను వెలిగించి, దెయ్యాలను పారదోలాలనే ఉద్దేశంతో ప్రజలు విచిత్రమైన వస్త్రధారణలో ఉంటారు. హలోవీన్ పండ అంటే ప్రాణం ఉన్నవారికి, మరణించినవారికి మధ్య సరిహద్దులు తొలగిపోతాయని అప్పటి ప్రజలు నమ్మేవారు. పూర్వం ‘హాలోవీన్’ రోజున పశువులను బలి ఇచ్చి, వాటి ఎముకలను కాల్చేవారు. ఈ రోజున చెడు ఆత్మలను అనుకరిస్తూ.. దెయ్యాలు, మంత్రగత్తుల్లా వేషాలు వేయడం ఆనవాయితీగా వస్తోంది. హలోవీన్ డే వస్తుందంటే చాలు ప్రజలు పలు హర్రర్ సినిమాల్లోని భయానక పాత్రలను అనుసరిస్తూ వికృత వేషాల్లో కనిపిస్తారు. తాజాగా దుబాయ్‌లో హలోవీన్ డేను పురస్కరించుకొని భారీ డ్రోన్ షోను నిర్వహించారు. ఇందులో ఓ అస్తిపంజరం డ్యాన్స్ చేస్తున్న దృశ్యాలను వీడియోలో చూడొచ్చు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. -
మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ లో లలా లాండ్ సీజన్ 3.0 (ఫోటోలు)
-
సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. యువ నటుడు, గాయకుడు మృతి
దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో హాలోవీన్ వేడుకలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ వేడుకలో దాదాపు 150పైగా ప్రజలు మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో యువ గాయకుడు, నటుడు లి జి హాన్(24) కూడా మృతి చెందారు. లి జి హాన్(Lee Ji-han) మృతితో దక్షిణ కొరియా సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అక్టోబర్ 29న సియోల్‌లో జరిగిన హాలోవీన్ వేడుకల్లో జరిగిన తొక్కిసలాటలో ఈ యంగ్ పాప్ సింగర్ మరణించినట్లు అక్కడి స్థానిక మీడియా ఆదివారం వెల్లడించింది. చదవండి: సమంత అనారోగ్యంపై స్పందించిన మరో అక్కినేని హీరో, వెంకటేశ్ కూతురు లీ జీ హాన్ మృతిపై కొరియాకు చెందిన పలువురు నటీనటులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. కాగా రాజధాని నగరం సియోల్‌లో రద్దీగా ఉండే నైట్ లైఫ్ జిల్లా ఇటావాన్‌లో శనివారం(అక్టోబర్ 29న) హాలోవీన్ వేడుకులను నిర్వహించారు. ఈ వేడుకకు భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ క్రమంలో అక్కడి ఇరుకైన వీధుల్లోంచి జనం ఒక్కసారిగా పోటెత్తడంతో తొక్కిసలాట సంభవించింది. ఈ ఘటనలో ఊపిరాడక దాదాపు 154పైగా మంది మరణించారు. అందులో ఈ యువ గాయకుడు లీ జీ హాన్ ఒకరు. -
South Korea: హాలోవీన్ వేడుకల్లో విషాదం (ఫోటోలు)
-
హాలోవీన్ వేడుకల్లో తొక్కిసలాట..150కి చేరిన మృతుల సంఖ్య
సియోల్: దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో హాలోవీన్ వేడుకలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి.çహాలోవీన్‌ను పురస్కరించుకుని శనివారం రాత్రి వీధుల్లో సంబరాలకు గుమిగూడిన జనం అకస్మాత్తుగా ఒక ఇరుకైన వీధిలోంచి పోటెత్తడంతో తొక్కిసలాట సంభవించింది. ఈ అనూహ్య ఘటనలో మృతుల సంఖ్య 151కి చేరింది. మరో 100 మందికి పైగా గాయపడ్డారు. తొక్కిసలాటలో ఊపిరాడక ఈ మరణాలు సంభవించాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Officials in Seoul said that at least 120 people were dead and 100 others were injured after a stampede in the South Korean capital's popular Itaewon district, where crowds had gathered to celebrate Halloween. https://t.co/auJuczo3Ll pic.twitter.com/7FXmfW8qab — The New York Times (@nytimes) October 29, 2022 ఇటెవోన్ ప్రాంతంలో శనివారం రాత్రి జరిగిన హాలోవీన్ ర్యాలీలో సుమారు లక్షమంది పాల్గొన్నాట్లు సమాచారం. వేల సంఖ్యలో గుమికూడిన ప్రజలు హ్యామిల్టన్ హోటల్ సమీపంలోని ఇరుకు మార్గం గుండా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో తోపులాట జరిగి వందల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. కొందరు ఊపిరాడక స్పృహ తప్పి పడిపోగా మరికొందరు చనిపోయారు. WARNING: GRAPHIC CONTENT – At least 149 people, mostly teenagers and young adults in their 20s, were killed in South Korea when a crowd celebrating Halloween surged into an alley in a night-life area of Seoul https://t.co/ZBB3cKhxO5 pic.twitter.com/evlVibGuUw — Reuters (@Reuters) October 29, 2022 పదుల సంఖ్యలో ఒకరిపై ఒకరు పడిపోయి అపస్మారక స్థితిలో ఉన్న వారికి సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించి ఆస్పత్రులకు తరలించారు. రక్షణ, సహాయక చర్యల నిమిత్తం 400 మంది సిబ్బందిని, 140 వాహనాలను వినిగించామన్నారు. ఊపిరాడక స్పృహ తప్పి పడిపోయిన 150 మందిపైగా బాధితులకు సీపీఆర్ అందించినట్లు తెలిపారు. ఘటన అనంతరం ఆ ప్రాంతమంతా అంబులెన్సులు, పోలీసు వాహనాల సంచారంతో నిండిపోయింది. Pushing and stressing hysterically, a man tries to escape..during the celebrations at the Halloween party..in South Korea..#SouthKorea #Halloween #Seoul #Itaewon #이태원 #이태원사고 #압사사고. pic.twitter.com/qqmgvLOXVf — Siraj Noorani (@sirajnoorani) October 29, 2022 తోపులాటకు కారణం తోపులాటకు దారి తీసిన కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఇరుకు వీధిలోని ఇటెవొన్ బార్‌కు ఓ సెలబ్రిటీ వచ్చారన్న వార్తలతో జనం అక్కడికి చేరుకునేందుకు ఒక్కసారిగా ప్రయత్నించడమే తోపులాటకు కారణమని స్థానిక మీడియా అంటోంది. 2020 కరోనా మహమ్మారి అనంతరం తొలిసారి జరుగుతున్న ఈ వేడుకలకు జనం పెద్ద సంఖ్యలో హాజరైనట్లు సమాచారం. ఆ ప్రాంతం అంత సురక్షితమైంది కాదంటూ శనివారం సాయంత్రం నుంచే సోషల్ మీడియాలో పోస్టులు ప్రత్యక్షం కావడం గమనార్హం. అత్యవసర సమావేశం విషాద ఘటన అనంతరం దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఆదివారం జాతీయ సంతాప దినాలను ప్రకటించారు. గాయపడిన వారికి వైద్య ఖర్చులు, మరణించిన వారి అంత్యక్రియలక నిర్వహణ ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తుకు ఆదేశించినట్లు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
భయమే శబ్దమ్..దెయ్యమే థీమ్!
‘నంది కొండ వాగుల్లోన..నల్లతుమ్మ నీడల్లో.... నీడల్లే ఉన్నా..నీతో వస్తున్నా నీ భరతం పడతా నిను ఎత్తుకుపోతా’ అంటూ సినీ ప్రేక్షకులకు మాత్రమే పరిమితమైన పాటలు ఇప్పుడు నగరవాసుల నిజజీవితంలోకి కూడా వచ్చేశాయి. విందు వినోదాలు, ఆట పాటలతో మాత్రమే నైట్ పార్టీలు నిర్వహించడం నిన్నటి మాట. భయపెట్టి, భయపడడంలో ఆనందాన్వేషణ చేయడం నేటి బాట. ఈ ట్రెండ్‌కి ఊతమిస్తోంది హాలోవీన్ థీమ్ సాక్షి, సిటీబ్యూరో: సిటీకి ఈవెంట్ మేనేజర్స్ కొత్త కాదు. అయితే తొలి ఈవెంట్‌నే డెవిల్ డెకరేషన్తో మొదలుపెట్టడం చూస్తే సిటీలో డెవిల్ జోష్ ఎలా ఉందో తెలుస్తుంది. సిటీ యువతి వినమ్ర రాజ్ కృష్ణ మెరక్ ఈవెంట్స్‌కు రూపకల్పన చేసింది. తన సంస్థ తరపున తొలి ఈవెంట్‌గా సిటీయూత్‌కి క్రేజీగా మారిన హాలోవీన్ థీమ్‌ను ఆమె ఎంచుకోవడం విశేషం. హార్నివాల్ పేరుతో ఎవర్ ఈవెంట్స్‌తో కలిసి ఆమె గత గురువారం దాదాపు 100 ఏళ్ల నాటి పురాతనభవనం రాక్ క్యాజిల్‌లో సక్సెస్‌ఫుల్‌గా హాలోవీన్ నైట్ నిర్వహించింది. డీజే మ్యూజక్, డ్యాన్స్‌ఫ్లోర్, లైవ్ బ్యాండ్, ర్యాపర్స్, ఫుడ్ స్టాల్స్...తో హార్నివాల్ హోరెత్తింది. దెయ్యం వెనుక కథ ఇదీ... పోటా పోటీగా నిను మించిన పిశాచిని నేనే అని పరస్పరం భయపెడుతూ సాగుతాయీ హాలోవీన్ పార్టీస్. చనిపోయిన వారి ఆత్మల్ని గౌరవించడానికి, అదే సమయంలో అవి తమనేమీ చేయలేవని చెప్పడం...ఈ వేడుకకు మూలమట. అందుకని ప్రత్యేకంగా ఒక రోజున రాత్రి సమయంలో తిరిగే భూతప్రేతాల్ని భయపెట్టడానికి భయంకరమైన కాస్ట్యూమ్స్ వేసుకునేవారట. హాలోవీన్నైట్ పుట్టుక వెనుక కథల్లో ఎక్కువ మంది నమ్మే కథ ఇది. కాలక్రమంలో ఇదొక కాలక్షేపం కాస్ట్యూమ్స్పార్టీలా మారిపోయింది. ఖండాంతరాలు దాటి సిటీకి కూడా వచ్చేసింది. ఫన్ అండ్ ఫియర్ విందు, వినోదంతో పాటు కాస్తంత భయం, ఆశ్చర్యం, వంటివన్నీ మిళితమై ఉండే థీమ్ కావడంతో ఇప్పుడు యూత్‌లో హాలోవీన్ థీమ్‌కి బాగా క్రేజ్ ఉంది. అయితే హాలోవీన్ పార్టీలు నిర్వహించడం అంత ఈజీ కాదు. ఏ మాత్రం భయపెట్టలేకపోయినా మరీ ఎక్కువ భయపెట్టినా కష్టమే. తగిన మోతాదులో ఫన్ అండ్ ఫియర్ బ్యాలెన్స్ చేసుకోవాలి. – వినమ్ర రాజ్ కృష్ణ, సయ్యద్ ఇంతిసారుద్దీన్ భయమే..జయం ఒకప్పుడు కేవలం అక్టోబరు 31వ తేదీన మాత్రమే హాలోవీన్ పార్టీల సందడి ఎక్కువగా కనిపించేది. అయితే వీటికి మంచి స్పందన వస్తుండడంతో రానురాను..రెగ్యులర్‌గా జరిగే పార్టీలకు కూడా ఈ థీమ్ జోడిస్తున్నారు. ఈ థీమ్‌తో జరిగే పార్టీస్‌లో వెల్కమ్ చెప్పే వ్యక్తి నుంచి వీడ్కోలు పలికేవారి వరకూ అంతా దెయ్యాలు, భూతాలు, మంత్రగాళ్లు, రాబంధులు, వాంపైర్స్, ఏంజెల్స్...గెటప్స్‌తో సిద్ధమవుతారు. దీని కోసం ప్రత్యేకంగా మాస్క్‌లు, టాటూలు ఉంటాయి. వీటికి హాలోవీన్ బార్బీ ఫ్రైడే, సన్డౌన్ పూల్పార్టీ, థ్రిల్లర్ వంటి పేర్లున్నాయి. -
చిన్నారి తలపై ట్రంప్ చాక్లెట్..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన చేష్టలతో ప్రపంచ దృష్టిలో పడటంలో ముందు వరుసలో ఉంటారు. తాజాగా ట్రంప్, తన భార్య మెలానియా ట్రంప్ శ్వేతసౌధంలో హాలోవీన్ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు వివిధ వేషాధారణల్లో ఉన్నవందలాది మంది చిన్నారులను ఆహ్వానించారు. ‘ట్రిక్ ఆర్ ట్రీట్’ అంటూ చిన్న పిల్లలు చాక్లెట్లు అడిగితే.. ట్రంప్, తన భర్య మెలానియాలు చాక్లెట్లను పంచారు. ఈ క్రమంలో మినియన్ ధరించిన ఓ చిన్నారి తల మీద ట్రంప్ సరదాగా చాక్లెట్ వేశారు. దీంతో ఆ పిల్లవాడు ముందుకు నడవటంతో చాక్లెట్ కింద పడింది. ట్రంప్‌ను అనుసరించిన మెలానియా కూడా ఆ చిన్నారిపై మరో చాక్లెట్ వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చేతికి ఇవ్వాల్సింది పోయి.. అలా తలపై చాక్లెట్ వేయడంపై.. పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ‘ఇద్దరూ అలానే చేశారని’ ఒకరు. పిల్లాడి చేతికి ఇవ్వచ్చు కాదా? అని మరొకరు వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇటీవల ఈ సిగరేట్లను నిషేదించాలనే ప్రభుత్వ ప్రణాళిక గురించి ట్రంప్ మాట్లాడుతూ.. 13 ఏళ్ల బారన్‌ను మెలానియా కుమారుడిగా ట్విటర్లో పేర్కొన్న విషయం తెలిసిందే. అదేవిధంగా ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ పేరును తడబడి ’టిమ్ ఆపిల్’ అని పిలిచారు. దీంతో నెటిజన్లు ట్రంప్‌పై తీవ్ర స్థాయిలో ట్రోల్ చేస్తూ కామెంట్లు గుప్పించిన విషయం తెలిసిందే. I’m sorry but... did she just put candy on this kid’s head?pic.twitter.com/uM79Rdla47 — Brian Tyler Cohen (@briantylercohen) October 29, 2019 -
దెయ్యాల గోల..!
ఈ వారమంతా దెయ్యాల గోలతో బాలీవుడ్ షేకైపోయింది. ఏ పార్టీకెళ్లినా... ఎవర్ని చూసినా... భూతాలు, పిశాచాల్లా భయపెట్టేశారు. సమాధులు, బూజు పట్టిన బురుజుల సెట్టింగుల్లో చిందులేసి దుమ్ములేపారు. ప్రియాంకాచోప్రా, సన్నీ లియోన్, బిపాసాబసు... ఎవరూ మినహాయింపు లేదు. ఎవరి ఫ్రెండ్ సర్కిల్‌తో వారు మాస్క్‌లేసుకుని తెగ ఎంజాయ్ చేశారు. హాలోవీన్ ఫెస్టివల్లో భాగమిదంతా! ఆ ఉత్సాహం అంతటితో ఆగలేదు. ఆ ఫొటోలను ఇదిగో ఇలా సోషల్ నెట్‌వర్క్‌ల్లో పోస్ట్ చేసి ప్రపంచమంతా ఫియర్ ఫీవర్ పాస్ చేశారు. -
భయపెట్టిన రాత్రి
నందికొండ వాగులు... నల్లతుమ్మా నీడలు... చంద్రవంక కోనలు...అన్నీ సిటీలో ప్రత్యక్షమయ్యాయి. రక్త పిశాచులు... కొమ్ముల కోలాలు... పబ్బులు, క్లబ్బుల్లో షికార్లు చేసి.. రచ్చ రంబోలా ఆడేశాయి. భయమేస్తుందా..! అయితే కాస్త రిలాక్స్ అవ్వండి. హాలోవీన్ ఫెస్టివల్లో భాగంగా నగరంలోని వివిధ క్లబ్స్, పబ్స్‌లో నిర్వహించిన నయా ట్రెండ్ పార్టీల్లోనివీ సన్నివేశాలు. సినిమా సెట్టింగులను తలపిస్తూ.. భయపెట్టి.. థ్రిల్ చేసే థీమ్స్‌తో కుర్రకారుకు కిక్కెక్కించాయి ఎంటర్టైన్మెంట్ సెంటర్లు. సోమాజిగూడ కిస్మత్, దుర్గం చెరువుల్లో జరిగిన హాలోవీన్ పార్టీల్లోనివీ ‘పిక్చర్స’.