చిన్నారి తలపై ట్రంప్‌ చాక్లెట్‌..! | Donald Trump Drops Candy Placing On Kids Head In Halloween | Sakshi
Sakshi News home page

చిన్నారి తలపై ట్రంప్‌ చాక్లెట్‌..!

Published Wed, Oct 30 2019 6:38 PM | Last Updated on Wed, Oct 30 2019 6:48 PM

Donald Trump Drops Candy Placing On Kids Head In Halloween - Sakshi

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన చేష్టలతో ప్రపంచ దృష్టిలో పడటంలో ముందు వరుసలో ఉంటారు. తాజాగా ట్రంప్‌, తన భార్య మెలానియా ట్రంప్‌ శ్వేతసౌధంలో హాలోవీన్‌ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు వివిధ వేషాధారణల్లో ఉన్నవందలాది మంది చిన్నారులను ఆహ్వానించారు. ‘ట్రిక్ ఆర్ ట్రీట్’ అంటూ చిన్న పిల్లలు చాక్లెట్లు అడిగితే.. ట్రంప్‌, తన భర్య మెలానియాలు చాక్లెట్లను పంచారు. ఈ క్రమంలో మినియన్‌ ధరించిన ఓ చిన్నారి తల మీద ట్రంప్‌ సరదాగా చాక్లెట్‌ వేశారు. దీంతో ఆ పిల్లవాడు ముందుకు నడవటంతో చాక్లెట్‌ కింద పడింది. ట్రంప్‌ను అనుసరించిన మెలానియా కూడా ఆ చిన్నారిపై మరో చాక్లెట్‌ వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌గా​ మారింది. చేతికి ఇవ్వాల్సింది పోయి.. అలా తలపై చాక్లెట్‌ వేయడంపై.. పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ‘ఇద్దరూ అలానే చేశారని’ ఒకరు. పిల్లాడి చేతికి ఇవ్వచ్చు కాదా? అని మరొకరు వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఇటీవల ఈ సిగరేట్లను నిషేదించాలనే ప్రభుత్వ ప్రణాళిక గురించి ట్రంప్‌ మాట్లాడుతూ.. 13 ఏళ్ల బారన్‌ను మెలానియా కుమారుడిగా ట్విటర్‌లో పేర్కొన్న విషయం తెలిసిందే. అదేవిధంగా ఆపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌ పేరును తడబడి ’టిమ్‌ ఆపిల్‌’ అని పిలిచారు. దీంతో నెటిజన్లు ట్రంప్‌పై తీ‍వ్ర స్థాయిలో ట్రోల్‌ చేస్తూ కామెంట్లు గుప్పించిన విషయం తెలిసిందే.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement