సెల్ఫీ వద్దు త్రీడి ఇమేజ్ ముద్దు! | Forget selfies: South Koreans capture moments with 3D figures | Sakshi

సెల్ఫీ వద్దు త్రీడి ఇమేజ్ ముద్దు!

Published Sat, Aug 6 2016 6:46 PM | Last Updated on Mon, Sep 4 2017 8:09 AM

దక్షిణ కొరియా వాసులు సెల్ఫీలకు నో చెప్పి.. 3డీ ఇమేజ్ లకు సై అంటున్నారు.

డిజిటల్ ఫోటోగ్రఫీకి కాలం చెల్లిపోనుందా? అవును దక్షిణ కొరియాలో తాజగా మొదలైన ఈ రెవల్యూషన్ ప్రపంచమంతటా పాకే అవకాశం లేకపోలేదు! డిజిటల్ ఫోటోగ్రఫీ కన్నా 3డీ ఫోటోల కోసం దక్షిణ కొరియన్లు ఎగబడుతున్నారు. సాధారణ ఫోటోల కంటే త్రీడి ఫోటోల్లో వయసు భేదం కొట్టొచ్చినట్లు కనిపిస్తుండటంతో వారు వీటిపై మక్కువ చూపిస్తున్నారు.


3డీ ఫోటోను తయారుచేసేందుకు దాదాపు 100 కెమెరాలను ఒక బూత్ లో ఉంచుతారు. ఫోటో కోసం వచ్చిన వ్యక్తిని అన్ని యాంగిల్స్ లో ఈ కెమెరాలను ఉపయోగించి చిత్రాలు తీస్తారు. ప్రస్తుతం ఇటువంటి చిత్రాలను ప్రింట్ చేయడానికి సియోల్ లో ఒక చోటే ప్లాంట్ ఉంది. జిప్సమ్ పౌడర్ ను ఉపయోగించి దాదాపు 1000 పొరలతో మెషీన్ 3డీ ఫోటోలను తయారు చేస్తుంది.


అన్ని యాంగిల్స్ లో ఫోటోలను చిత్రించడం వల్ల వ్యక్తి ఎలా కోరుకుంటే అలా ఫోటోను ప్రింట్ చేయించుకునే అవకాశం కలుగుతోంది. 2 ఇంచ్ ల నుంచి 12 ఇంచ్ ల సైజుల్లో 3డీ ఫోటోలు లభ్యమవుతున్నాయి. మరి ఖరీదు విషయానికి వస్తే ఒక్క ఫోటోకు దాదాపు లక్షా పదివేల రూపాయలు ఖర్చవుతోంది. కపుల్స్, ఫ్యామిలీస్, పెంపుడు జంతువుల ఫోటోలతో సెల్ఫీలు దిగడంకంటే 3డీ ఫోటోలు తీయించుకునేందుకు ఇష్టపడుతున్నట్లు స్టూడియో ప్రతినిధి లీ-సై చియాన్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement