
మరణం సమీపిస్తున్నా... ఉల్లాసంగానే విద్యార్థులు!!
విహార యాత్రకని విద్యార్థులతో బయలుదేరిన నౌక సముద్రంలో మునిగిపోతుంది.
విహార యాత్రకని విద్యార్థులతో బయలుదేరిన నౌక సముద్రంలో మునిగిపోతుంది. అయితే అందులోని విద్యార్థులు మాత్రం తాము ప్రయాణిస్తున్న నౌకకు ముప్పు వాటిల్లందని...మరికొన్ని నిముషాలలో మృత్యు కౌగిలిలోకి జారుతున్నామని వారు అనుకోలేదేమో ఏమో. తమకు అవేమీ పట్టవన్నట్లు ఆ నౌకలోని విద్యార్థులు మాత్రం ఉల్లాసంగా ఉత్సాహంగా జోకులు వేసుకున్నారు. టైటానిక్ నౌక లాగా ఈ నౌక కూడా మునిగిపోతుందని ఓ విద్యార్థి జోక్ పేలిస్తే.... నౌక మునిగి పోతే ఆ వార్త మీడియాలో హల్ చల్ చేస్తుందంటూ మరోకరు జోక్ చేశారు.
దక్షిణ కోరియాలో ఇటీవల విద్యార్థులతో విహారయాత్ర కోసం బయలుదేరిన నౌక ప్రమాదంలో చిక్కున్న తర్వాత పార్క్ సు హైయిన్ అనే విద్యార్థి నౌకలో జరుగుతున్న తతంగాన్ని అంతా తన కెమెరాలో బంధించాడు. ఆ కెమెరాలోని దృశ్యాలను పార్క్ తల్లితండ్రులు శుక్రవారం ఇక్కడ విడుదల చేశారు. పార్క్ మృతదేహన్ని ఇటీవలే సముద్రం నుంచి వెలికి తీసి... అతడి తల్లితండ్రులకు అప్పగించారు. కుమారుడి షర్ట్ జేబులో ఉన్న సెల్ ఫోన్ను వారు పరిశీలించగా... వారికి నౌక మునిగిపోతున్న క్రమంలో విద్యార్థులు పేల్చిన జోకులతో ఆ సెల్ ఫోన్లో నిక్షిప్తమై ఉంది. గతనెల 16వ తేదీన దాదాపు 459 మంది (అత్యధిక మంది విద్యార్థులు)తో విహార యాత్రకు బయలుదేరిన ఫెర్రీ (నౌక) దక్షిణ కొరియాలోని దక్షిణ తీరంలో ప్రమాదం సంభవించింది. ఆ ప్రమాదంలో ఫెర్రీ క్రమక్రమంగా నీటిలో మునిగిపోయిన సంగతి తెలిసిందే.