సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దక్షిణకొరియా ప్రతిష్టాత్మక సియోల్ శాంతి పురస్కరాన్ని ప్రకటించింది. అంతర్జాతీయ సహకారం, అభివృద్ధిలో కృషి చేసినందుకు 2018 ఏడాదికి గాను మోదీకి ఈ అవార్డు దక్కింది. భారత్‌ను అభివృద్ధి బాట పట్టించిన మోదీ.. ప్రపంచ శాంతికై పనిచేశారనీ, భారత్‌లో మానవ వనరుల అభివృద్ధితో ‘మోదినామిక్స్’ చేశారని, భారత్‌లో అవినీతి కట్టడికి ప్రధాని మోదీ కృషి చేశారనీ, నోట్ల రద్దు వంటి సంస్కరణలు ప్రవేశపెట్టారని సియోల్ శాంతి పురస్కార కమిటీ పేర్కొంది.
1990లో 24వ ఒలింపిక్ క్రీడలను సియోల్‌లో విజయవంతంగా నిర్వహించిన దానికి గుర్తుగా ఈ పురస్కారాన్ని అందజేస్తున్నారు. ఈ పురస్కారం అందుకుంటున్న పద్నాలుగో వ్యక్తి మోదీ. ఆయనకంటే ముందు యూఎన్ సెక్రటరీ జనరల్ కోఫి అన్నన్, జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మోర్కెల్ వంటి ప్రముఖులకు ఈ అవార్డు అందజేశారు. కాగా.. తనకు సియోల్ శాంతి పురస్కారం ప్రకటించడం చాలా ఆనందంగా ఉందని మోదీ పేర్కొన్నారు. దక్షిణకొరియాతో భారత్‌కు ఉన్న మెరుగైన భాగస్వామ్య ఒప్పందాల వల్లనే ఇది సాధ్యమైందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment