
కొరియాలో 175కి పెరిగిన మెర్స్ కేసులు
దక్షిణ కొరియాలో మరో ముగ్గురు మంగళవారం మెర్స్ (మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్) వైరస్ బారిన పడ్డారు.
సియోల్: దక్షిణ కొరియాలో మరో ముగ్గురు మంగళవారం మెర్స్ (మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్) వైరస్ బారిన పడ్డారు. దీంతో ఈ వైరస్ సోకిన వారి సంఖ్య 175కి చేరిందని ఆ దేశ వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ వైరస్ బారిన పడిన నలుగురు వ్యక్తులను ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ చేసినట్లు తెలిపింది. దీంతో డిశ్చార్జీ చేసిన వారి సంఖ్య 54కు చేరుకుందని వివరించింది. మెర్స్ బారిన పడిన వారు సియోల్లోని శామ్సంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే 14 ఏళ్ల యువకుడి వల్ల మెర్స్ వైరస్ 80 మందికి సోకిందని .... అయితే డిశ్చార్జ్ అయిన వారిలో సదరు యువకుడు కూడా ఉన్నాడని పేర్కొంది.