Middle East Respiratory Syndrome
-
'మెర్స్'తో మరో ఇద్దరు మృతి
సియోల్ : దక్షిణ కొరియాలో మెర్స్ (మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్) వైరస్ సోకిన వారిలో మరో ఇద్దరు శుక్రవారం మరణించారు. దాంతో మృతుల సంఖ్య 31 పెరిగింది. ఈ మేరకు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాగా దేశంలో మరో మెర్స్ కేసు నమోదు అయిందని పేర్కొంది. అది శామ్సంగ్ ఆస్పత్రి వైద్యునికే అని చెప్పింది. అతడికి చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది. దీంతో మెర్స్ వైరస్ సోకిన వారి సంఖ్య 181కి చేరింది. ఈ వైరస్ సోకిన వారిలో 81 మంది కోలుకున్నారని... ఇంకా 69 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపింది. ఈ ఏడాది మే 20వ తేదీన దక్షిణ కొరియాలో తొలి మెర్స్ వైరస్ కేసు నమోదయిన సంగతి తెలిసిందే. -
కొరియాలో 175కి పెరిగిన మెర్స్ కేసులు
సియోల్: దక్షిణ కొరియాలో మరో ముగ్గురు మంగళవారం మెర్స్ (మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్) వైరస్ బారిన పడ్డారు. దీంతో ఈ వైరస్ సోకిన వారి సంఖ్య 175కి చేరిందని ఆ దేశ వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ వైరస్ బారిన పడిన నలుగురు వ్యక్తులను ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ చేసినట్లు తెలిపింది. దీంతో డిశ్చార్జీ చేసిన వారి సంఖ్య 54కు చేరుకుందని వివరించింది. మెర్స్ బారిన పడిన వారు సియోల్‌లోని శామ్సంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే 14 ఏళ్ల యువకుడి వల్ల మెర్స్ వైరస్ 80 మందికి సోకిందని .... అయితే డిశ్చార్జ్ అయిన వారిలో సదరు యువకుడు కూడా ఉన్నాడని పేర్కొంది. -
కొరియాలో మరో మూడు మెర్స్ కేసులు నమోదు
సియోల్: దక్షిణ కొరియాలో మరో ముగ్గురు మెర్స్ (మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్) వైరస్ బారిన పడ్డారు. దీంతో ఈ వైరస్ సోకిన వారి సంఖ్య 169కి చేరిందని ఆ దేశ వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆదివారం వెల్లడించింది. ఈ వైరస్ బారిన పడిన ఇద్దరు వైద్య సిబ్బందితోపాటు వైద్యుడు ప్రస్తుతం సియోల్‌లోని శామ్ సంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపింది. ఈ వైరస్‌తో ఇప్పటి వరకు 25 మంది మృతి చెందారని చెప్పింది. అయితే మరో ఆస్పత్రిలోని వైద్య సిబ్బందిలోని ఓ వ్యక్తి కూడా ఈ వైరస్ సోకినట్లు అనుమానిస్తున్నామని... ఈ నేపథ్యంలో అతడికి స్థానికంగా మరో ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. మెర్స్ వైరస్ దక్షిణ కొరియాను వణికిస్తున్న సంగతి తెలిసిందే. -
కొరియాలో మరో ఎనిమిది మెర్స్ కేసులు నమోదు
సియోల్: దక్షిణ కొరియాలో మరో ఎనిమిది మంది మెర్స్ (మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్) వైరస్ బారిన పడ్డారు. దీంతో ఈ వైరస్ సోకిన వారి సంఖ్య 162కు చేరిందని ఆ దేశ వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ బుధవారం వెల్లడించింది. ఈ వైరస్ బారిన పడిన ఐదుగురు ప్రస్తుతం సియోల్‌లోని శామ్సంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపింది. అలాగే ఈ ఆసుపత్రిలోని ఓ వైద్యుడికి ఈ వైరస్ ఇటీవలే సోకినట్లు గుర్తించామని చెప్పింది. ఈ వైరస్ సోకిన మరో ముగ్గురు హల్యమ్ యూనివర్శిటీ ఆసుపత్రితోపాటు గ్యాంగ్గాండ్ క్యూంగ్జీ యూనివర్శిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొంది. ఈ వైరస్ సోకి ఇప్పటి వరకు 19 మంది మరణించారని... అలాగే 124 మంది వైద్య చికిత్స పొందుతున్నారని... వారిలో 18 మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించింది. అయితే మెర్స్ వైరస్ సోకిన ఇద్దరిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసినట్లు దక్షిణ కొరియా వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరించింది. మెర్స్ (మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్) వైరస్ దక్షిణ కొరియాను వణికిస్తోంది. ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తుండడంతో దాదాపు దేశవ్యాప్తంగా 700 స్కూళ్లను మూసివేసిన సంగతి తెలిసిందే. -
ప్రపంచాన్ని వణికిస్తున్న మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్