
సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ మలయాళ నటుడు, కమెడియన్ ప్రదీప్ కొట్టాయం(61) గుండెపోటుతో కేరళలో కన్నుమూశారు. ఆయన మృతి వార్త తెలిసి మాలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖు, సహా నటీనటులు సోషల్ మీడియాలో ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.
చదవండి: బోయపాటి సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతోన్న హీరోయిన్!
ఈ క్రమంలో మలయాళ నటుడు, స్టార్ హీరో పృధ్వీరాజ్ సుకుమారన్ అయన మృతిపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయనకు నివాళులు అర్పిస్తూ హీరో పధ్వీరాజ్ ట్వీట్ చేశారు. ఆయన ప్రదీప్ కేఆర్ తన కెరీర్‌లో 70కి పైగా చ్రితాల్లో నటించారు. తెలుగులో సైతం ఆయన పలు చిత్రాల్లో నటించారు. ఏం మాయ చేశావేలో జార్జ్ అంకుల్ ప్రదీప్ తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. రాజా రాణి చిత్రంలో కూడా ఓ పాత్ర పోషించారాయన.
Rest in peace! #KottayamPradeep 🙏 pic.twitter.com/zUHU2GflqH
— Prithviraj Sukumaran (@PrithviOfficial) February 17, 2022