
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళ నటుడు బాబూరాజ్ వాజపల్లి(59) కన్నుమూశారు. బాబూరాజ్‌కు ఛాతిలో నొప్పి రావడంతో కేరళలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవికరించారు. బాబురాజ్ ఆకస్మిక మరణంతో మలయాళ చిత్ర పరిశ్రమలో విషాద చాయలు నెలకొన్నాయి. ఆయన మృతికి పలువురు మాలీవుడ్ నటీనటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: సెట్‌లో ఓవరాక్షన్ చేసి తన్నులు తిన్న హీరో.. వీడియో వైరల్
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. కాగా బాబురాజ్‌కు భార్య సంధ్య, కుమారుడు బిషన్‌లు ఉన్నారు. ఆయన సినిమాల విషయానికి వస్తే.. బాబూరాజ్ ‘త్రిస్సూర్‌లో డ్రామా స్కెచ్’ల ద్వారా కెరీర్ ప్రారంభించాడు. బాబూరాజ్ ఆండ్రాయిడ్ కుంజప్పన్, సీఐఏ, మాస్టర్ పీస్, గుండా జయన్, బ్రేకింగ్ న్యూస్, మనోహరన్ ,అర్చన 31 నాటౌట్ వంటి మలయాళ హిట్ చిత్రాలలో కీలక పాత్రలు పోషించాడు. కేవలం నటుడిగానే కాకుండా ఆర్ట్ డైరెక్టర్, స్క్రీన్ రైటర్‌గా కూడా ఆయన పనిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment