
ప్రముఖ మలయాళ నటుడు, సినీ రచయిత పి. బాలచంద్రన్(69) కన్నుమూశారు. గత ఎనిమిది నెలలుగా అనాగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆయనకు భార్య శ్రీలత, కుమార్తె, కుమారుడు ఉన్నారు. 1991లో మోహన్‌లాల్ హీరోగా నటించిన ‘అంకుల్ బన్’ అనే సినిమాతో ఆయన స్క్రీన్ రైటర్‌గా వెండితెరకు పరిచయమయ్యారు.
ఈ సినిమాతో మంచి గుర్తింపు పొందిన ఆయన ఆ తర్వాత పలు చిత్రాలకు స్క్రీన్ రైటర్‌గా కథ, మాటలు అందించారు. కళా రంగానికి ఆయన అందించిన సేవకుగాను కేరళ సాహిత్య అకాడమీ అవార్డుతో పాటు కేరళ ప్రొఫెషనల్ నాటక అవార్డును అందుకున్నారు. ఈ అవార్డును 1989లో వేసిన ‘పావన్ ఉస్మాన్’ అనే నాటాకానికి అందుకున్నారు. బాలచంద్రన్ నటుడు కాకముందు మహాత్మ గాంధీ యూనివర్సిటీలో టీచర్‌గా పనిచేశారు. ఆ తర్వాత థియేరిటికల్ ఆర్ట్స్, నటనలో శిక్షణ తీసుకున్నారు.
చదవండి:
చెక్ మేట్.. సూటిగా సొల్లు లేకుండా!
నిజంగానే ఈ జంట విడిపోతుందా!
Comments
Please login to add a commentAdd a comment