కరోనాతో ప్రముఖ టీవీ నటి మృతి | TV actress Divya Bhatnagar Last Breath With Covid 19 At 34 | Sakshi
Sakshi News home page

టీవీ నటి దివ్య భట్నాగర్‌ మృతి

Published Mon, Dec 7 2020 12:00 PM | Last Updated on Mon, Dec 7 2020 1:44 PM

TV actress Divya Bhatnagar Last Breath With Covid 19 At 34 - Sakshi

ముంబై: కరోనా వైరస్‌ సామాన్యుల నుంచి సినీ, రాజకీయ ప్రముఖులను కబళిస్తోంది. ఈ మహమ్మారి బారిన పడిన కొంతమంది సినీ, రాజకీయ నేతలు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్‌ టీవీ నటి దివ్య భట్నాగర్‌(34) సోమవారం మృతి చెందారు. ఇటీవల కరోనా బారిన పడిన ఆమె ముంబైలోని సెవెన్‌హిల్స్‌ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ తెల్లవారు జామున ఆమె పరిస్థితి విషమించడంతో వైద్యులు ఆమెకు వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. (చదవండి: దేశంలో తగ్గుతున్న కరోనా కొత్త కేసులు)

అయితే దివ్య అధిక రక్తపోటుతో పాటు కరోనా మహమ్మారితో  పోరాడి ఈ రోజు తుది శ్వాస విడిచారు. ఆమె మరణవార్తతో పలువురు టీవీ ప్రముఖులు దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తూ సోషల్‌ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. కాగా దివ్య భట్నాగర్ కామెడీ షో తేరా యార్ హూన్ మెయిన్ షూటింగ్‌లో సమయంలో అనారోగ్యంతో బాధపడుత్ను ఆమెను ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. ఆమె ‘ఏ రిషిత క్యా కెహలాతా హై’, ‘సంస్కార్’, ‘ఉడాన్’, ‘జీత్‌ గయి తొహ్ పియా మోర్రే’ వంటి సిరీయల్స్‌లో నటించారు. (చదవండి: కోవిడ్‌ సెంటర్లో పెళ్లి.. వీడియో వైరల్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement