
వాషింగ్టన్: అమెరికాలో భారత సంతతికి చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు మరణించినట్లు అక్కడి అధికారులు మంగళవారం ప్రకటించారు. మరణించిన వారిలో భరత్ పటేల్(62), ఆయన కోడలు నిషా పటేల్(32), ఆయన ఎనిమిదేళ్ల మనవరాలుగా పోలీసులు గుర్తించారు. తమ ఇంటి వెనకాల స్విమ్మింగ్ ఫూల్‌లో పడి వారు మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు. (బీజింగ్‌లో కరోనా.. సూపర్ స్ర్పెడ్డర్ అతనేనా !)
ఈ ఘటనపై లెఫ్టినెంట్ పోలీసు అధికారి మీడియాతో మాట్లాడుతూ.. వారి పక్కింటివారు ఘటనపై సీపీఆర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటన స్థలానికి చేరుకున్నారని చెప్పారు. అయితే అప్పటికే వారు మృతి చెందడంతో పోస్టుమార్టం నిమిత్తం మృతదేహలను ఆసుపత్రికి తరలించామని చెప్పారు. కాగా వారు ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ ఫూల్‌లో పడి మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించినట్లు ఆయన తెలిపారు.