
కరోనా వైరస్ చిత్ర పరిశ్రమను కుదిపెస్తోంది. మునుపటి కంటే కరోనా సెకండ్ వేవ్ సినీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వారం రోజులుగా టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, శాండల్‌వుడ్ పరిశ్రమకు చెందిన ప్రముఖులు కరోనాతో మృత్యువాత పడుతుండగా.. తాజాగా మరో యువ దర్శకుడు మహమ్మారికి బలైపోయిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఇక ఆయన మృతితో కన్నడ పరిశ్రమలో విషాదం నెలకొంది.
కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకుడు నవీన్(36) కోవిడ్-19తో మృత్యువాత పడినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారని, కర్ణాటకలోని ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు కూడా పూర్తెయినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. కాగా నవీన్ 2011లో ‘వన్ డే’ అనే చిత్రంతో దర్శకుడిగా అడుగుపెట్టారు. ఈ చిత్రంలో అప్పు వెంకటేష్, రేవన్నలు ప్రధాన పాత్రల్లో నటించారు.