
సాక్షి, విశాఖపట్నం: విశాఖ డాబా గార్డెన్‌లో విషాదం చోటుచేసుకుంది. కరోనా సోకిన వ్యక్తి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన సోమవారం జరిగింది. తుమ్మల రమేష్ కుమార్ అనే వ్యక్తికి కరోనా సోకి చికిత్స పొందుతుండగా ఈ రోజు మృత్యువాత పడ్డాడు. ఆ విషయం తెలిసిన మృతుడి భార్య అతడి పిల్లలు శానిటైజర్ తాగి ఆత్మహత్యయత్నంకు పాల్పడటంతో స్థానికులు వారిని కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.