బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నేటితో 54వ వసంతంలోకి అడుగు పెట్టాడు. ఇవాళ (సెప్టెంబర్ 9) ఆయన బర్త్‌డే. కానీ ఆయన కుటుంబం ప్రస్తుతం తీవ్ర విషాదంలో మునిగింది. బుధవారం (సెప్టెంబర్ 8) తెల్లవారుజామున అక్షయ్ మాతృమూర్తి అరుణ భాటియా మృతి చెందిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ముంబైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న తుదిశ్వాస విడిచారు. తల్లి మరణించిన తెల్లవారే తన జన్మదినం కావడంతో అక్షయ్ భావోద్వేగానికి లోనయ్యారు.
చదవండి: బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఇంట తీవ్ర విషాదం
ఈ సందర్భంగా తల్లి తన చెంపపై ముద్దు పెడుతున్న ఫొటోను గురువారం షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు. ‘ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎన్నడూ ఊహించలేదు. కానీ అమ్మ పైనుంచి నా కోసం కచ్చితంగా హ్యాపీ బర్త్‌డే పాట పాడుతుందని తెలుసు! మీ అందరి సంతాపం, విషెస్‌కు ధన్యవాదాలు’ అంటూ ఆయన ట్వీట్‌లో రాసుకొచ్చారు. కాగా అక్షయ్ తన తల్లితో గడిపిన ప్రతి క్షణాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఆమెతో కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో షూటింగ్ సందర్భంగా లండన్‌కు తీసుకెళ్లి వీల్ చైర్‌పై తల్లితో అక్కడి రోడ్లపై సందడి చేసిన వీడియోను కూడా పంచుకున్నారు.
చదవండి: ప్రియుడిని తలుచుకుని వెక్కి వెక్కి ఏడ్చిన బిగ్‌బాస్ కంటెస్టెంట్
Would have never liked it this way but am sure mom is singing Happy Birthday to me from right up there! Thanks to each one of you for your condolences and wishes alike. Life goes on. pic.twitter.com/PdCGtRxrvq
— Akshay Kumar (@akshaykumar) September 9, 2021
ఈ సందర్భంగా ‘మనం పనిలో ఎంత బిజీగా ఉన్న, ఎంత ఎత్తుకు ఎదిగినా మన తల్లిదండ్రులు కూడా వృద్ధాప్యం వైపు అడుగులు వేస్తున్నారనే విషయాన్ని మరవకండి. బిడ్డలుగా వీలైనంత సమయం వారితో కేటాయించండి’ అంటూ రాసుకొచ్చారు. కాగా అక్షయ్ ప్రస్తుతం ‘సిండ్రెల్లా’ సినిమా చేస్తున్నారు. ఆ షూటింగ్ కోసం ఆయన లండన్ వెళ్లారు. ఆ సమయంలోనే తల్లి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని తెలియడంతో హుటాహుటినా ముంబైకి చేరుకున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment