
సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ చలన చిత్ర నిర్మాత గోరంట్ల రాజేంద్రప్రసాద్(86) మృతిచెందారు. నిన్న ఫిలిం ఎడిటర్ గౌతమ్ రాజు హఠాన్మరణం మరువకముందే నిర్మాత రాజేంద్ర ప్రసాద్ మృతితో టాలీవుడ్ సినీ పరిశ్రమ మరోసారి విషాదంలోకి వెళ్లింది. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
చదవండి: నటి ఖుష్బూకు కీలక బాధ్యతలు
దీంతో నిర్మాత మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తూ ఆయన ఆత్మకు చేకూరాలని ప్రార్థిస్తున్నారు. కాగా మాధవి పిక్చర్స్ బ్యానర్లో దొరబాబు, సుపుత్రుడు, కురుక్షేత్రం, ఆటగాడు వంటి తదితర చిత్రాలను నిర్మించారు ఆయన. అంతేకాదు ప్రముఖ దివంగ నిర్మాత రామానాయడుతో కలిసి పలు చిత్రాలకు సహా నిర్మాతగా గోరంట్ల రాజేంద్ర ప్రసాద్ వ్యవహరించారు.