కరోనా సెకండ్ వేవ్ దేశవ్యాప్తంగా కొరలు చాస్తోంది. ఈ మహమ్మారి ప్రభావం మునుపటి కంటే ఈ సారి మరింత్ర తీవ్ర ప్రభావం చూపుతోంది. రోజురోజుకు కోవిడ్‌తో ఎంతో మంది ప్రాణాలు విడుస్తున్నా ఇక సినీ పరిశ్రమలో కరోనా అంతులేని విషాదాన్ని నింపుతోంది. గత వారంరోజులుగా బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, శాండల్‌వుడ్ పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు, దర్శక-నిర్మాతలు మృత్యువాత పడుతున్నారు. తాజాగా బాలీవుడ్‌కు చెందిన ఎడిటర్ అజయ్‌శర్మ(30) కరోనాతో మృతి చెందారు.
ఇటీవల కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో న్యూఢిల్లీలోని ఓ ప్రవైటు ఆస్పత్రిలో చేరినా ఆయన ఈ రోజు(గురువారం) పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. యే జావానీ హే దీవాని, బర్ఫీ, అగ్నిపత్, కోయ్ పో చే, డర్టీ పిక్చర్ వంటి చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ పని చేసిన ఆయన తాప్పీ లీడ్ రోల్‌లో వస్తున్న స్పోడ్స్ డ్రామ చిత్రం ‘రష్మీ రాకేట్’కు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. అంతేగాక ఇప్పటికే ‘లూడో’, ‘జగ్గాజూసూస్’, ‘కార్వాన్’ చిత్రాలకు కూడా ఆయన ఎడిటర్‌గా పని చేశారు. ఆయనకు భార్య, నాలుగేళ్ల కూమారుడు ఉన్నారు. అతి చిన్న వయసులోనే అజయ్ మృతి చెందడంపై బాలీవుడ్ నిర్మాత అనురాగ్ బసుతో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
This is still difficult to accept. I barely have courage to write this. Ajay independently edited Jagga Jasoos, Ludo but he was associated with me since Life in a Metro, Barfii, Kites . He was my core team, my creative soundboard, my friend. pic.twitter.com/3TiAc10jTe
— anurag basu (@basuanurag) May 5, 2021
Comments
Please login to add a commentAdd a comment