Ajay Sharma
-
భారత క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఢిల్లీ ఆల్‌రౌండర్
ఢిల్లీ: భారత ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ మనన్ శర్మ భారత క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం విదేశీ లీగ్‌లో మంచి అవకాశాలు లభిస్తున్నాయని.. అందుకే భారత క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నాడు. కాగా త్వరలోనే యూఎస్ మేజర్ క్రికెట్ లీగ్ ఆడేందుకు కాలిఫోర్నియా బయలుదేరి వెళుతున్నట్లు మనన్ శర్మ స్ఫష్టం చేశాడు. చదవండి: భారత క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఉన్ముక్త్ చంద్ 2017లో ఢిల్లీ తరపున భారత క్రికెట్లోకి అడుగుపెట్టిన మనన్ శర్మ 35 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లాడి 1208 పరుగులు(ఒక సెంచరీ.. 8 అర్థసెంచరీలు) ,113 వికెట్లు తీశాడు.ఇక లిస్ట్ ఏ క్రికెట్లో 560 పరుగులు చేసిన మనన్ శర్మ 26 టీ20 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లాడి 32 వికెట్లు తీశాడు. ఇక 2016లో మనన్ శర్మను రూ.10 లక్షల కనీస ధరకు కేకేఆర్ కొనుగోలు చేసింది. కాగా ఢిల్లీ క్రికెట్లో విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, గౌతమ్ గంభీర్లతో మనన్ శర్మ డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకున్నాడు. కాగా మనన్ శర్మ తండ్రి అజయ్ శర్మ భారత మాజీ క్రికెటర్ అన్న సంగతి తెలిసిందే. 1988లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన అజయ్ శర్మ టీమిండియా తరపున 31 వన్డేలు.. ఏకైక టెస్టు మ్యాచ్ ఆడాడు. 2000వ సంవత్సరంలో మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతలో దోషిగా తేలిన అజయ్ శర్మపై జీవితకాల నిషేదం పడింది. అప్పటినుంచి అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు దేశవాలీ క్రికెట్‌కు దూరమయ్యాడు. చదవండి: నీరజ్ చోప్రా ముందు అసభ్యకర డ్యాన్స్‌లు; ఫ్యాన్స్ ఆగ్రహం -
విషాదం: కరోనాతో ఎడిటర్ అజయ్ శర్మ మృతి
కరోనా సెకండ్ వేవ్ దేశవ్యాప్తంగా కొరలు చాస్తోంది. ఈ మహమ్మారి ప్రభావం మునుపటి కంటే ఈ సారి మరింత్ర తీవ్ర ప్రభావం చూపుతోంది. రోజురోజుకు కోవిడ్‌తో ఎంతో మంది ప్రాణాలు విడుస్తున్నా ఇక సినీ పరిశ్రమలో కరోనా అంతులేని విషాదాన్ని నింపుతోంది. గత వారంరోజులుగా బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, శాండల్‌వుడ్ పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు, దర్శక-నిర్మాతలు మృత్యువాత పడుతున్నారు. తాజాగా బాలీవుడ్‌కు చెందిన ఎడిటర్ అజయ్‌శర్మ(30) కరోనాతో మృతి చెందారు. ఇటీవల కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో న్యూఢిల్లీలోని ఓ ప్రవైటు ఆస్పత్రిలో చేరినా ఆయన ఈ రోజు(గురువారం) పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. యే జావానీ హే దీవాని, బర్ఫీ, అగ్నిపత్, కోయ్ పో చే, డర్టీ పిక్చర్ వంటి చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ పని చేసిన ఆయన తాప్పీ లీడ్ రోల్లో వస్తున్న స్పోడ్స్ డ్రామ చిత్రం ‘రష్మీ రాకేట్’కు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. అంతేగాక ఇప్పటికే ‘లూడో’, ‘జగ్గాజూసూస్’, ‘కార్వాన్’ చిత్రాలకు కూడా ఆయన ఎడిటర్‌గా పని చేశారు. ఆయనకు భార్య, నాలుగేళ్ల కూమారుడు ఉన్నారు. అతి చిన్న వయసులోనే అజయ్ మృతి చెందడంపై బాలీవుడ్ నిర్మాత అనురాగ్ బసుతో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. This is still difficult to accept. I barely have courage to write this. Ajay independently edited Jagga Jasoos, Ludo but he was associated with me since Life in a Metro, Barfii, Kites . He was my core team, my creative soundboard, my friend. pic.twitter.com/3TiAc10jTe — anurag basu (@basuanurag) May 5, 2021 -
జీఎస్టీతో నిత్యావసరాలపై మోయలేని భారం
► ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కార్యదర్శి ఎ.అజయ్‌శర్మ అనకాపల్లిటౌన్ : పట్టణంలో సీఐటీయూ కార్యాలయంలో జీఎస్టీపై మంగళవారం అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కార్యదర్శి ఎ.అజయ్‌శర్మ మాట్లాడుతూ జీఎస్టీ వల్ల మధ్య తరగతి ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకుల ధరలు పెరిగి మోయలేని భారం పడనుందన్నారు. బడా వ్యాపారులకు జీఎస్టీ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. 2011లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టాలనుకున్న ఈ జీఎస్టీ విధానం ఇపుడు బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. కొన్ని రాష్ట్రాల్లో కొన్ని వస్తువులు, చలనచిత్రాలపై భారీ పన్ను వసూలు చేస్తుండడం వల్ల అటువంటి రాష్ట్రాలు నష్టపోతాయన్నారు. రాష్ట్రాలకు పన్నుపై ఉన్న అధికారాలను కేంద్రం చేజిక్కించుకుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలకు మద్యం, పెట్రోల్ అత్యధిక ఆదాయం వస్తుండడం వల్ల జీఎస్టీ మినహాయింపు ఇచ్చిందన్నారు. కార్యక్రమంలో పలువురు ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు పాల్గొన్నారు. -
రైవాడ కోసం ప్రాణత్యాగానికి సిద్ధం
ప్రాజెక్టు నీటి సాధన కమిటీ హెచ్చరి క ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమం ఉధృతం కెనాల్‌కు గండ్లు కొట్టేందుకు రైతులు వెనుకాడబోరని స్పష్టీకరణ దేవరాపల్లి: రైవాడ నీటిని రైతులకు అంకితం చేస్తూ జీవో జారీ చేసేవరకు పోరాటం కొనసాగిస్తామని, అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని రైవాడ ప్రాజెక్టు నీటి సాధన కమిటీ అల్టిమేటం విధించింది. రైవాడ సాధన కమిటీ ఈ నెల 14 నుంచి చేపట్టిన పాదయాత్ర మంగళవారం మండలంలోని అచ్చియ్యపాలెం, కొండూరుపాలెం, ఎ. కొత్తపల్లి, కేఎం పాలెం మీదుగా సాగింది. సాధన కమిటీ ప్రతినిధులు ముషిడిపల్లి వద్ద బసచేశారు. ఇప్పటివరకు 62 కిలోమీటర్ల మేర కొనసాగింది. సాధన కమిటీ సభ్యుడు వేచలపు చినరామునాయుడు మాట్లాడుతూ కొన్నేళ్లు రైవాడ రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వాల ఆటలు ఇకపై సాగనిచ్చేది లేదన్నారు. రైవాడను జలాశయాన్ని రైతులకు అంకితం చేస్తానని చెప్పి గద్దెనెక్కిన సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీని విస్మరించారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం దిగిరాకుంటే కెనాల్‌కు గండ్లు కొట్టేందుకుకూడా రైతులు వెనుకాడరని హెచ్చరించారు. ఎదురయ్యే తీవ్ర పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.ఈ నెల 18న జరగనున్న ముగింపు సభలో ఉద్యమం ఉధృతం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. ఎంపీ, ఎమ్మెల్యేల ఇళ్లు ముట్టడించి నిరసన తెలుపుతామని అన్నారు. సాధన కమిటీ సభ్యుడు లెక్కల శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతాంగానికి నష్టం కలిగించే జీవో నంబరు 160ను రద్దు చేయడమే కాకుండా, జీవీఎంసీ బకాయిపడ్డ రూ.112 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా 50 వేల ఎకరాలకు సాగునీరందించేలా ప్రభుత్వం స్పందించాలని కోరారు. మద్దతు తెలిపిన అజయ్‌శర్మ రైవాడ ప్రాజెక్టు నీటి సాధన కమిటీ పాదయాత్రకు ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కమిటీ ప్రధాన కార్యదర్శి అజయ్‌శర్మ మద్దతు తెలిపారు. మంగళవారం ఆయన ఎ.కొత్తపల్లి సమీపంలో పాదయాత్ర బృందాన్ని ఆయన కలిశారు. ఇతర దేశాలనుంచి పరిశ్రమలు ఆహ్వానిస్తున్న ప్రభుత్వం అందుకు అవసరమయ్యే నీరు, పట్టణవాసుల తాగునీటికి అవసరమైన ప్రాజెక్టు నిర్మాణంపై దృష్టి సారించకపోవడం దారుణమన్నారు. పట్టి సీమ మాదిరిగా పురుషోత్తపురం వద్ద ఎత్తిపోతల పథకం నిర్మిస్తే విశాఖ నగర ప్రజలకు తాగునీటితో పాటు పారిశ్రామిక అవసరాలకు నీటి సమస్య తీరిపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు డి.వెంకన్న, గండి నాయనబాబు, ఆదిరెడ్డి కన్నబాబు, ఎన్నంశెట్టి సత్యనారాయణ, చల్లా జగన్, పెద్ది నాయుడు, సీహెచ్ రాజు, నాగిరెడ్డి సత్యనారాయణ, శీరంరెడ్డి సింహాద్రప్పడు, గొంప మల్లునాయుడు, రాము, వి.నాయుడుబాబు పాల్గొన్నారు. -
అజయ్ శర్మకు క్లీన్చిట్
మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలను కొట్టివేసిన జిల్లా కోర్టు న్యూఢిల్లీ: దాదాపు 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఢిల్లీ మాజీ కెప్టెన్ అజయ్ శర్మకు మ్యాచ్ ఫిక్సింగ్ కేసు నుంచి ఉపశమనం లభించింది. అతనిపై వచ్చిన ఫిక్సింగ్ ఆరోపణలను జిల్లా కోర్టు కొట్టివేసింది. కోర్టు తీర్పు సంతృప్తినిచ్చిందని చెప్పిన శర్మ ఇక నుంచి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తానన్నాడు. ‘గత 14 ఏళ్లు నా జీవితంలో ఓ కఠిన దశ. నేను ఎలాంటి తప్పు చేయలేదని కోర్టు నమ్మింది. నాకు ఎవరిపై కోపం లేదు. ఫస్ట్ క్లాస్ కెరీర్ అర్ధంతరంగా ముగిసినందుకు బాధపడడం లేదు. గతాన్ని మరచి ముందుకు సాగాలని కోరుకుంటున్నా. రంజీ, ఇతర దేశవాళీ టోర్నీల్లో నా కుమారుడు మన్నన్ శర్మ ఆడుతుంటే చూడాలని ఉంది. ఢిల్లీ క్రికెట్‌కు అవసరమైన సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నా’ అని 50 ఏళ్ల శర్మ పేర్కొన్నాడు. ఫిక్సింగ్ కేసు నుంచి బయటపడినందున బోర్డు నుంచి రావాల్సిన బకాయిలను బీసీసీఐ చెల్లిస్తే బాగుంటుందన్నాడు. 2000వ సంవత్సరంలో మ్యాచ్‌ఫిక్సింగ్ ఆరోపణల కారణంగా అజయ్శర్మపై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించింది. -
హెచ్ఐవీ సోకిన 12 మంది చిన్నారులు దత్తత!
మీరట్: మంచి పనులు చేయడానికి కావాల్సింది మాటలు కాదు.. చేతలు కావాలి. అందుకే ప్రార్ధించే పెదవుల కన్నా.. సాయం చేసే చేతులే మిన్నా అన్నారు. హెచ్ఐవీ సోకిన 12 మంది పిల్లల్ని దత్తత తీసుకుని మనకు చేతనైన సాయంలో భాగం కావాలని సాటి చెప్పాడు అజయ్ శర్మ. మీరట్ లోని గంగానగర్ లో ఉంటున్నఅజయ్ శర్మ హెచ్ఐవీ బారిన పడ్డ చిన్నారులకు అన్నీ తానై ఆసరాగా నిలిచాడు. ఆ చిన్నారులు తల్లి దండ్రులను ఎయిడ్స్ మహమ్మారి కాటేయడంతో వారు అజయ్ వద్దకు చేరారు. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు బ్రతికున్నాన్నాళ్లు వారి వద్దే ఉన్నా తరువాత ఆదరణ కరవైంది. బంధువులు కూడా ఛీదరించుకున్న సమయంలో అజయ్ వారిని అక్కున చేర్చుకుని ఆశ్రయమిచ్చాడు. కొంతమంది సందర్శకులు ఆ పిల్లల ఉన్న గృహాన్ని సందర్శించినప్పుడు ఈ విషయాలు వెలుగుచూశాయి. ఆ సందర్శకులను వివేక్ అనే 12 ఏళ్ల చిన్నారి చెమర్చిన కళ్లతో స్వాగతం పలకడం వారిని కలిచివేసింది. వీరిలో ఉన్న చిన్నారులంతా ఏడు సంవత్సరాల నుంచి 17 ఏళ్ల లోపు వారే కావడం గమనార్హం. 'నాకు 12 మంది పిల్లలు ఉన్నారు. ప్రతీ ఒక్కరూ నాకు అమూల్యమైన వారే. అత్యంత ప్రాణాంతక వ్యాధి బారిన పడ్డ ఆ తల్లిదండ్రులకు వారిని పెంచడం నిజంగా కష్టంతో కూడుకున్న పని. ఆ క్రమంలో ఈ 12 మంది నాచెంతకు చేరడం నా అదృష్టం' అంటూ అజయ్ నవ్వుతూ ఆ సందర్శకులకు తెలిపాడు. -
రెండో గమన సూత్రాన్ని న్యూటన్ కనుక్కోలేదు!
షిమ్లా: ప్రఖ్యాత శాస్త్రవేత్త సర్ ఐజాక్ న్యూటన్ ప్రతిపాదించిన గమన సూత్రాలలో లోపాలున్నాయని భారతీయ పరిశోధకుడు అజయ్ శర్మ వెల్లడించారు. ద్రవ్యరాశి, వేగానికి సంబంధించిన న్యూటన్ రెండో గమనసూత్రం(ఎఫ్ఎంఏ)ను వాస్తవానికి ఆయన కనుక్కోనే లేదని శర్మ స్పష్టం చేశారు. న్యూటన్ 1686లో రచించిన ‘ప్రిన్సిపా’ పుస్తకాన్ని నిశితంగా అధ్యయనం చేయగా ఎఫ్ఎంఏను కనుగొన్నవారు ఎవరో తెలియదన్న విషయం స్పష్టమైందని శర్మ ఈ మేరకు తాను రాసిన ‘బియాండ్ న్యూటన్ అండ్ ఆర్కిమెడిస్’ గ్రంథంలో పేర్కొన్నారు. ఎఫ్ఎంఏ సూత్రాన్ని ఇచ్చినవారెవరో ఇప్పటిదాకా తెలియదని, భవిష్యత్తు తరాలకు వాస్తవం చెప్పాల్సిన అవసరం ఉన్నందున ఆ మేరకు ప్రపంచంలోని 220 దేశాల పాఠ్యపుస్తకాలన్నింటిలోనూ మార్పులు చేయాలన్నారు. న్యూటన్ రెండో గమనసూత్రంలో లోపాలున్నాయంటూ ఆయన తన పుస్తకంలో ఉదహరణనిచ్చారు. ఒక కుర్రాడు రబ్బరు బంతిని, గుడ్డ బంతిని 2ఎన్(న్యూటన్)ల బలంతో గోడకు కొట్టినప్పుడు రబ్బరు బంతి 10 మీటర్లు వెనక్కి వస్తే, గుడ్డ బంతి 5 మీటర్లు మాత్రమే వెనక్కి వస్తుందని పేర్కొన్నారు. అందువల్ల చర్యకు ప్రతిచర్య ఉన్నా, అన్నిసార్లూ అవి రెండూ సమానమే కావల్సిన అవసరంలేదని వివరించారు. హిమాచల్ ప్రదేశ్ విద్యాశాఖలో అసిస్టెంట్ డెరైక్టర్ అయిన అజయ్ శర్మ(50) 31 ఏళ్లుగా ప్రాథమిక సూత్రాలపై పరిశోధనలు సాగిస్తున్నారు. శర్మ రాసిన ‘బియాండ్ న్యూటన్ అండ్ ఆర్కిమెడిస్’ పుస్తకాన్ని నిపుణులు ఏడు నెలలపాటు పరిశీలించి నిపుణులు పచ్చజెండా ఊపాకే ‘కేంబ్రిడ్జి ఇంటర్నేషనల్ సైన్స్ పబ్లిషింగ్’ సంస్థ దానిని అక్టోబరు 28న ప్రచురించింది.