
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ శుక్రవారం(అక్టోబర్ 29)న గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనకు భారత సినీ, రాజకీయ నాయకులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పించారు. ఆయన కన్నుమూసి 4 రోజులు గడుస్తున్నా ఇప్పటికి పునీత్ మరణాన్ని అభిమానులతో పాటు నటీనటులు జీర్ణించుకోలేకపోతున్నారు. కంఠీరవ స్టేడీయంలో ఆదివారం పునీత్ అంత్యక్రియలు ముగిశాయి. ఆయన అంత్యక్రియల్లో తెలుగు, మలయాళ, కన్నడ పరిశ్రమలకు చెందిన అగ్ర హీరోలంతా పాల్గొన్నారు.
ఇక సోషల్ మీడియాలో పునీత్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన అక్కినేని హీరో నాగార్జున ఈ రోజు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. మంగళవారం పునీత్ ఇంటికి వెళ్లిన ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం పునీత్ సోదరుడు, హీరో శివరాజ్‌కుమార్‌తో పాటు ఆయన భార్య, పిల్లలను పరామర్శించారు. శివరాజ్‌తో కాసేపు మాట్లాడి ఓదార్చారు. కాగా ఆయన అంత్యక్రియలకు మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ వెంకటేశ్, శ్రీకాంత్, జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు పలువుకు తెలుగు హీరోలు హజరైన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment