
ముంబై: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇంట మరో విషాదం చోటుచేసుకుంది. సుశాంత్ ఆకస్మిక మృతిని తట్టుకోలేక అతడి వదిన (కసిన్ బ్రదర్ భార్య) బీహార్‌లోని పూర్ణియాలో సోమవారం కన్నుముశారు. సుశాంత్ మరణంచిన విషయాన్ని తట్టుకోలేని ఆమె.. అప్పటి నుంచి ఆహారం తీసుకోవడం మానేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సోమవారం ముంబైలో సుశాంత్ అంత్యక్రియలు జరుగుతున్న సమయంలోనే ఆమె బీహార్‌లో తుది శ్వాస విడిచారు. (అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా!)
సుశాంత్ ముంబై బాంద్రాలోని తన నివాసంలో ఆదివారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సుశాంత్ మానసిక ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకున్నాడని, ఒత్తిడికి అతడు మందులు వాడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ముంబైలోని పవన్ హన్స్ శ్మశానవాటికలో సోమవారం కుటుంబ సభ్యులు, సినీ పరిశ్రమకు చెందిన అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో సుశాంత్ అంత్యక్రియలు జరిగాయి. (‘ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నావనుకుంటున్నా’)
Comments
Please login to add a commentAdd a comment