
ప్రముఖ సంగీత దర్శకుడు శాంతిరాజ్ కోశల(53) కరోనాతో మృతి చెందారు. ఇటీవల అస్వస్థతకు గురైన ఆయన కోవిడ్ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. అనంతరం హోం క్వారంటైన్‌లో ఉంటు వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకుంటున్న ఆయనకు బుధవారం రాత్రి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తింది. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను కటక్‌లోని ఎస్‌బీబీ హాస్పిటల్‌కు తరలించారు.
ఈ నేపథ్యంలో అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఆయన తుదిశ్వాస విడిచారు. కోశల మరణం పట్ల ఒడిశాకు చెందిన సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఒడిసా సీఎం నవీన్ పట్నాయక్ కోశల మృతిపై విచారం వ్యక్తం చేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అదే విధంగా ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. కాగా శాంతిరాజ్ కోశల 20కి పైగా ఒడియా చిత్రాలకు సంగీతం అందించి ప్రశంసలు అందుకున్నారు. అంతేగాక 2వేలకు పైగా ఆయన సొంతంగా ఆల్బమ్స్ రూపొందించారు.
Comments
Please login to add a commentAdd a comment