
Shiva Shankar Master Last Wish: ప్రముఖ నృత్య దర్శకుడు శివ శంకర్ మాస్టర్ (72) కరోనాతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన మరణవార్త విని టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటీనుటుల, హీరోలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతి పరిశ్రమకు తీరని లోటు అంటూ శివ శంకర్ మాస్టర్‌కు మెగాస్టార్ చిరంజీవి, సోనుసూద్, మంచు విష్ణుతో పాటు పలువురు హీరోలు నివాళులు అర్పిస్తున్నారు.
చదవండి: టాలీవుడ్‌లో విషాదం.. శివశంకర్ మాస్టర్ ఇకలేరు
డ్యాన్స్‌తోనే ఎన్నో హావభావలను పలికించే మాస్టర్ 80కి పైగా చిత్రాలకు కొరియోగ్రఫి అందించారు. అలాంటి మాస్టర్ తన చివరి శ్వాస వరకు పని చేయాలని ఆకాంక్షించారు. మరణం కూడా తనకు షూటింగ్‌లోనే రావాలని, సినిమా సెట్‌లోనే తను కన్నుమూయాలనేది మాస్టర్ కోరిక. ఈ విషయాన్ని తరచూ ఆయన తన సన్నిహితులతో పాటు పలు ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చేవారు. దీన్ని బట్టి ఆయన వృత్తిని ఎంత ప్రేమించి ఉంటారో ఊహించుకోండి. 2009లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘మగధీర’ చిత్రానికి కొరియోగ్రఫి అందించిన శివ శంకర్ మాస్టర్ ఈ మూవీకిగాను జాతీయ పురస్కారం అందుకున్నారు.