సాక్షి, ప్రకాశం : నటి శ్రీదేవి మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మృతి సినీ పరిశ్రమకు తీరని లోటని ఆయన అన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
‘శ్రీదేవి మరణ వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది. తన నటన, ఛరిష్మాతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న వ్యక్తి ఆమె. దక్షిణ భాషలతోపాటు బాలీవుడ్‌లోనూ ఆమె నటించి అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు. మరచిపోలేని పాత్రలేన్నో ఆమె పోషించి మెప్పించారు. ఇంగ్లీష్ వింగ్లీష్‌లో గృహిణి పాత్ర శ్రీదేవి ఎంతటి అసమాన నటి అన్న విషయం తెలియజేసింది..
ఆ లెజెండరీ నటి మృతి భారతీయ చలన చిత్ర పరిశ్రమకు, ముఖ్యంగా ఆమెను అభిమానించే వారికి తీరని లోటు. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment