Mohan Babu Condolence On Editor Gowtham Raju Death: సినిమాల్లో ఎడిటర్‌గా గౌతమ్‌రాజు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న గౌతంరాజు (68) బుధవారం (జులై 6) కన్నుమూసిన విషయంతెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నగరంలోని ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం డిశ్చార్జ్ అయ్యారు. అయితే అర్ధరాత్రి ఒక్కసారిగా పరిస్థితి విషమించడంతో 1:30 నిమిషాలకు గౌతంరాజు తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలుపుతూ గౌతమ్ రాజు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఆయన మృతిపట్ల డైలాగ్ కింగ్ మోహన్ బాబు, పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. 'ఎడిటర్ గౌతమ్‌రాజు నాకు అత్యంత ఆత్మీయుడు.. నా సొంత బ్యానర్‌లో ఎన్నో సినిమాలకు ఎడిటర్‌గా పనిచేశారు. అతను మంచి మనిషి. అతని బిడ్డలు కూడా మన స్కూల్లో చదువుకున్నారు. వాళ్లిద్దరూ క్షేమంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కానీ అతని మరణ వార్త వినగానే నా మనసును కలిచివేసింది. తన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను' అని మోహన్ బాబు ట్వీట్ చేశారు.
కానీ అతని మరణ వార్త వినగానే నా మనసు కలిచివేసింది. తన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
— Mohan Babu M (@themohanbabu) July 6, 2022
అలాగే తెలుగు చిత్ర పరిశ్రమలో ఎడిటర్‌గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని పొందిన గౌతమ్ రాజు కన్నుమూయడం విచారకరమని పవన్ కల్యాణ్ పేర్కొన్నాడు. ఎడిటర్‌గా వందల చిత్రాలకు పని చేసిన అనుభవశాలి అని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment