Gowtham Raju
-
ఆయన మరణం మనసును కలిచివేసింది: మోహన్ బాబు
Mohan Babu Condolence On Editor Gowtham Raju Death: సినిమాల్లో ఎడిటర్‌గా గౌతమ్‌రాజు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న గౌతంరాజు (68) బుధవారం (జులై 6) కన్నుమూసిన విషయంతెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నగరంలోని ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం డిశ్చార్జ్ అయ్యారు. అయితే అర్ధరాత్రి ఒక్కసారిగా పరిస్థితి విషమించడంతో 1:30 నిమిషాలకు గౌతంరాజు తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలుపుతూ గౌతమ్ రాజు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన మృతిపట్ల డైలాగ్ కింగ్ మోహన్ బాబు, పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. 'ఎడిటర్ గౌతమ్‌రాజు నాకు అత్యంత ఆత్మీయుడు.. నా సొంత బ్యానర్లో ఎన్నో సినిమాలకు ఎడిటర్‌గా పనిచేశారు. అతను మంచి మనిషి. అతని బిడ్డలు కూడా మన స్కూల్లో చదువుకున్నారు. వాళ్లిద్దరూ క్షేమంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కానీ అతని మరణ వార్త వినగానే నా మనసును కలిచివేసింది. తన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను' అని మోహన్ బాబు ట్వీట్ చేశారు. కానీ అతని మరణ వార్త వినగానే నా మనసు కలిచివేసింది. తన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. — Mohan Babu M (@themohanbabu) July 6, 2022 అలాగే తెలుగు చిత్ర పరిశ్రమలో ఎడిటర్‌గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని పొందిన గౌతమ్ రాజు కన్నుమూయడం విచారకరమని పవన్ కల్యాణ్ పేర్కొన్నాడు. ఎడిటర్‌గా వందల చిత్రాలకు పని చేసిన అనుభవశాలి అని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు. -
‘ది టర్న్’ సినిమా ఫస్ట్ గ్లింప్స్ విడుదల
ప్రముఖ హాస్య నటుడు గౌతమ్ రాజు తనయుడు కృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది టర్న్’. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో మనోహర్ వల్లెపు, లడ్డు, అరుణ్ కుమార్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తుండగా వాసంతి, రత్నమాల ఫీమేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. కౌశల్ క్రియేషన్స్ బ్యానర్ పతాకంపై డీబీ దొరబాబు దర్శకత్వంలో భీమినేని శివ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఆర్ సారథీ సంగీతం సమకూరుస్తుండగా ప్రదీప్ జంబిగా ఎడిటింగ్ అందిస్తున్నారు. విజయ్ ఠాగూర్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా ఈ చిత్రానికి ఆయన విజువల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. కాగా ఈరోజు హీరో కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సందర్భంగా నిర్మాత భీమినేని శివ ప్రసాద్ మాట్లాడుతూ.. ది టర్న్ సినిమా కథ చాలా బాగుంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు మెచ్చే వారికి ఈ చిత్రం తప్పక నచ్చుతుంది. మా హీరో కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అయన నటన చాలా బాగుంది. మొదటి షెడ్యూల్ పూర్తి చేశాం.. త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తాం అన్నారు. -
‘అచ్చతెలుగు అమ్మాయి’లా అందరికీ నచ్చింది
కంబాలచెరువు (రాజమండ్రి) :‘నువ్వు లేక నేను లేను’, ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘ఇంద్ర’, ‘అల్లరి రాముడు’, ‘అందాల రాముడు’, ‘అడవి రాముడు’, ‘నేనున్నాను’ చిత్రాల్లో అలరించిన అందాల ఆర్తి అగర్వాల్ ఇక లేదన్న కబురు జిల్లాలో సినీ అభిమానుల గుండెల్ని బరువెక్కించింది. 31 ఏళ్లకే ఆమె జీవితానికి తెరపడడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. గుజరాత్‌కు చెందిన యువతి అయినా అచ్చం అచ్చ తెలుగు ఆడపడుచులా కనిపించిన ఆమె ఎన్నో చిత్రాల్లో హీరోయిన్గా అందరినీ మెప్పించింది. ఆమెకు జిల్లాతో మంచి అనుబంధం ఉంది. ఆమె నటించిన పలు చిత్రాల షూటింగ్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో జరిగింది. ఎన్టీఆర్‌తో నటించిన ‘అల్లరి రాముడు’ తాటిపాకలో చిత్రీకరణ జరుపుకొంది. సునీల్ హీరోగా నటించిన ‘అందాల రాముడు’ చిత్రం షూటింగ్ కోనసీమలో జరిగింది. ‘గోరింటాకు, నువ్వులేక నేనులేను’ చిత్రాలు కూడా ఇక్కడ షూటింగ్ జరుపుకొన్నారుు. ఆ సమయంలో ఆర్తి మన ప్రాంత వంటకాలు, పూతరేకులు, తాపేశ్వరం కాజాలను అడిగి మరీ తెప్పించుకుని, ఇష్టంగా తిన్నారని సినీ పరిశ్రమతో సంబంధం ఉన్న నగరానికి చెందిన వారు చెప్పారు. మన ప్రాంతానికి చెందిన అమ్మాయి కాకపోయినా అచ్చ తెలుగు ఆడపడుచులా ఉండి, అందరితో కలిసిపోయేదన్నారు. కాగా ఆమె మరణం సినీపరిశ్రమకు తీరని లోటని పలువురు సినీప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఆమె కొంత మానసిక ఒత్తిడితో బాధపడిందని, అది సినీపరిశ్రమలో సర్వ సాధారణమయినా దాన్ని జయించలేకపోయిందని అన్నారు. దివ్యభారతి చనిపోయినప్పుడు గుండె కలుక్కుమందని, ఇప్పుడూ అంతే బాధ కలిగిందని అన్నారు. చాలా బాధపడుతున్నా.. పదహారణాల తెలుగు పడుచులా కనిపించే ఆర్తి అగర్వాల్ మంచి నటి. ఆమె అకాల మరణవార్త తెలుసుకుని దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఆమెతో నేను ‘సోగ్గాడు, గోరింటాకు’తో పాటు మరో ఐదు సినిమాల్లో నటించాను. కొద్దినెలల క్రితం ఒక ఫంక్షన్లో కలిసినప్పుడు బొద్దుగా కనిపించింది. అదే ఆమె పాలిట శాపంగా మారింది. - గౌతంరాజు, సినీనటుడు ముందుగానే మేల్కొని ఉండాల్సింది మంచి నటిని కోల్పోయూం. సినిమా హీరోయిన్ అంటే కచ్చితంగా శరీరాన్ని నాజూకుగా ఉంచుకోవాలి. లేదంటే వచ్చిన ఆఫర్లు తిరిగి వెళ్లిపోతాయి. సరైన ఫిట్నెస్ లేక ఆర్తి అవకాశాలు కోల్పోయింది. ఆమె నటించిన సమయంలో రేసులో ఉన్న హీరోరుున్లను అధిగమించిందే కానీ సరైన విధానంలో వెళ్లలేకపోయింది. - గాయత్రి, హీరోయిన్ (ఒక రొమాంటిక్ క్రైం స్టోరీ) -
ఇండస్ట్రీ నాకు కావాలి... ఇండస్ట్రీకి నేను అక్కర్లేదు!
సంభాషణం తూర్పు గోదావరి యాసతో తెరమీద అదరగొట్టేసే నటులు చాలా కొద్దిమందే ఉన్నారు. వారిలో గౌతంరాజు ఒకరు. కొన్ని దశాబ్దాలుగా తన నటనతోటి, యాసతోటి ప్రేక్షకుల మనసులు దోచుకుంటున్నారాయన. ఇన్నేళ్ల తన ప్రయాణం గురించి, గెలుపోటముల గురించి గౌతంరాజు మనసు విప్పి చెప్పిన మాటలు... మీకు గుర్తింపు తెచ్చింది గోదావరి యాసే. అలా మాట్లాడాలని మీరే అనుకున్నారా? ఎవరైనా సలహా ఇచ్చారా? అలా ఏం లేదు. మొదట్లో కొన్ని పాత్రల స్వభావం దృష్ట్యా అలా మాట్లాడాను. అది నచ్చడంతో దర్శకులందరూ అలాగే మాట్లాడమనేవారు. మీదే గోదావరి.. తూర్పా? పశ్చిమమా? తూర్పే. మాది రాజోలు. అయితే నాన్నగారి వ్యాపారం రీత్యా కాకినాడలో స్థిరపడ్డాం. పెరిగింది, చదివింది అంతా అక్కడే. నటుడిగా మారిందీ అక్కడే. నటన మీద ఆసక్తి ఎలా కలిగింది? చిన్నప్పట్నుంచీ మనసు కళల మీదే ఉండేది. అందుకే నాలుగో తరగతిలో ఉండగానే స్టేజి ఎక్కాను. వయసుతో పాటు ఆసక్తి కూడా పెరుగుతూ వచ్చింది. నాలుగో తరగతిలోనే మొదలు పెట్టేశారు. ఇంట్లోవాళ్ల ప్రోత్సాహమా? నటిస్తానంటే నాన్న తాట తీసేవారు. నాటకం మధ్యలో స్టేజి మీది నుంచి ఈడ్చుకొచ్చిన సందర్భాలూ ఉన్నాయి. అయినా నాకు ఆ పిచ్చి తగ్గలేదు. మా నాన్న దానధర్మాలు బాగా చేసేవారు. అందరినీ ఆదరించేవారు. దాంతో మా ఇల్లు ఎప్పుడూ మనుషులతో కిటకిటలాడేది. చదువుకోవడానికి కూడా కుదిరేది కాదు. దాంతో మా ఇంటికెదురుగా ఉన్న హోటల్ పై అంతస్తులోని గదిలో, నా ఫ్రెండ్‌తో కలిసి చదువుకునేవాడిని. అక్కడ్నుంచి మా ఇల్లు స్పష్టంగా కనిపించేది. నాన్న ఇంటికొచ్చి పడుకునేవరకూ చూసి, ఆ తర్వాత రిహార్సల్స్‌కి వెళ్లిపోయేవాడిని. మళ్లీ తెల్లవారుజామునే వచ్చి ఏమీ ఎరగనట్టు పుస్తకాలు పట్టుకునేవాడిని! నాటకాలకే ఒప్పుకోనివారు... సినిమాలకెలా ఒప్పుకున్నారు? ఒప్పుకున్నారని చెప్పలేను కానీ, నేను నా ఇష్టాన్ని గెలిపించుకున్నానంతే. బీఎస్సీ ఫైనలియర్లో ఉండగానే మా అక్క కూతురితో నా పెళ్లి జరిపించేశారు. నా భార్య ఝాన్సీ నన్ను బాగా అర్థం చేసుకునేది. తన ప్రోత్సాహంతోనే నేను అనుకున్నవన్నీ చేశాను. నటనను కొనసాగించగలిగాను. ఇంతవరకూ ఎన్ని సినిమాలు చేశారు? మూడువందల పైనే. ‘వసంతగీతం’ నా తొలిచిత్రం. మొదటిరోజు షూటింగ్లో తొలి సన్నివేశమే ఏఎన్నార్‌తో. భయంతో డైలాగ్ మర్చిపోయాను. ఆయన ధైర్యం చెప్పి నేను ఫ్రీ అయ్యేలా చేశారు. అంత గొప్ప నటుడితో సినీప్రయాణం మొదలవడం నా అదృష్టం. అయితే ఎన్టీయార్‌తో పనిచేయలేకపోవడం నా దురదృష్టం! ఇన్ని సినిమాలు చేశారు. తగిన గుర్తింపు వచ్చిందంటారా? లేదు. ఇప్పటికీ నేను గుర్తింపు కోసం ఆరాటపడుతూనే ఉన్నాను. నటుడంటే కైకాల సత్యనారాయణగారిలా అన్ని రకాల పాత్రలూ చేయగలగాలి. నేనూ చేయగలను. కానీ అంత గొప్ప పాత్రలు రాలేదు. నిరాశపడుతున్నారా? నిరాశేం లేదు. ఇక్కడ టాలెంట్ ఒక్కటీ చాలదు. అదృష్టం కూడా ఉండాలి. కోరుకున్నవి కాకపోయినా అవకాశాలైతే వచ్చాయి. కాస్తో కూస్తో సంపాదించుకుని జీవితంలో స్థిరపడ్డాను. అది చాలు. నిజానికి డబ్బు కంటే మనుషుల్ని సంపాదించుకోవడం ముఖ్యం అనుకుంటాన్నేను. అందుకే అందరితో మంచిగా ఉంటాను. నాలాంటివాళ్లు వస్తుంటారు, పోతుం టారు. కాబట్టి ఇండస్ట్రీకి నేను అక్కర్లేదు. నాకే ఇండస్ట్రీ కావాలి. అందుకే ఇండస్ట్రీకి, అందులోని వారికి విలువిస్తాను. మీ అబ్బాయి కృష్ణని హీరోని చేస్తున్నట్టున్నారు. అది మీ నిర్ణయమేనా? కాదు. పరిశ్రమలోని కష్టనష్టాల్ని చూసినవాణ్ని కాబట్టి నాకు పిల్లల్ని ఇండస్ట్రీకి తీసుకురావడం ఇష్టం లేదు. కానీ తను హీరో అవ్వాలని ఆశపడ్డాడు. కాదనలేక పోయాను. నాటకాలు, సీరియళ్లకి దూరమైనట్టేనా? దూరమైపోలేదు కానీ, చేసే తీరిక లేక గ్యాప్ తీసుకున్నాను. నాకు నటుడిగా జన్మనిచ్చిన నాటకం, నా తల్లిలాంటిది. నా ప్రతిభను నిరూపించుకోవడానికి అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించిన టీవీ నాకు పినతల్లిలాంటిది. జీవితంలో నేను ముందుకు వెళ్లేలా చేసిన సినిమా నా తండ్రిలాంటిది. వీటిలో దేనికీ నేను దూరం కాలేను. భవిష్యత్ ప్రణాళికలేంటి? నా నటతృష్టను తీర్చే మంచి అవకాశాలు వస్తే చేయాలనుంది. అలాగే నటన తర్వాత నేను అంత ప్రాధాన్యతనిచ్చే విషయం... సేవ. ఉన్నదాంట్లో కొంత లేనివారికి పెట్టాలి. మా అమ్మానాన్నల నుంచి అబ్బింది నాకీ లక్షణం. అందుకే తీరిక దొరికినప్పుడల్లా ఏదో రకంగా సేవ చేస్తుంటాను. నేను నెలకొల్పిన ‘అభయ చారిటబుల్ ట్రస్ట్’ ద్వారా వెనుకబడిన నటీనటులు, జర్నలిస్టులకు సహాయపడాలని అనుకుంటున్నాను. ప్రస్తుతానికి ఇవే నా ప్రణాళికలు, లక్ష్యాలు! - సమీర నేలపూడి -
నటరాజు.. ఈ గౌతంరాజు
ఇంటర్వ్యూ ఘరానామొగుడు, ఇంద్రుడు చంద్రుడు, శంకర్‌దాదా ఎంబీబీఎస్ వంటి సినిమాల్లో హాస్యం పండించటమే కాదు.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో ప్రశంసలు అందుకున్న గౌతంరాజు.. విలక్షణ నటుడిగా పేరు సంపాదించారు. హాస్యమే కాదు.. బీభత్సం సృష్టించే ప్రతి నాయకుడి క్యారెక్టర్లోనూ ఆయన ఇట్టే ఒదిగిపోతారు. ప్రస్తుతం తనయుడు చిరంజీవి కృష్ణంరాజు (కృష్ణ)ను హీరోగా పరిచయం చేసే పనిలో నిమగ్నమయ్యూరు. కౌతవరంలో షూటింగ్ జరుపుకొంటున్న ‘ఈ నేల-ఈ గాలి’ సీరియల్లో మైనర్ బాబుగా నటిస్తున్న ఆయన ఆదివారం కొద్దిసేపు ‘సాక్షి’తో మాట్లాడారు. - గుడ్లవల్లేరు (కౌతవరం) 1980లో సినీ రంగప్రవేశం మాది తూర్పుగోదావరి జిల్లా రాజోలు. నాన్న కృష్ణంరాజుకు ఉన్న వ్యాపార సంబంధాల వల్ల కాకినాడలో స్థిరపడ్డాం. 1980లో శ్రీధర్, సంగీత తారాగణంతో నిర్మించిన ‘పుణ్యభూమి కళ్లు తెరిచింది’ అనే సినిమాతో సినీరంగ ప్రవేశం చేశాను. నాల్గో తరగతి నుంచే నాటికలు, నాటకాలు వేసేవాళ్లం. స్త్రీ పాత్ర లేని నాటకల్ని ఎన్నుకునేవాళ్లం. నన్నంతా రాజేంద్రప్రసాద్‌లా నటిస్తున్నానంటారు. అవకాశాల కోసం అష్టకష్టాలు నుదిటిపై గీత బాగుంటేనే సినీ అవకాశాలు లభిస్తాయి. సినీ పరిశ్రమలో అవకాశాల కోసం ఎన్నో కష్టాలు పడ్డాను. టాలెంట్‌కు తోడు అదృష్టం కూడా ఉండాలి. ఒకర్ని ఒకరు తొక్కేయటం అనేది కొంతకాలమే. ఎక్కువకాలం అది సాధ్యం కాదు. రెండు సినిమాల్లో విలన్‌గా.. హాస్యనటుడిగా మాత్రమే ప్రేక్షకులకు పరిచయమైన నేను ఈ మధ్యనే విడుదలైన ఉదయ్‌కిరణ్ సినిమా ‘జైశ్రీరామ్’లో ప్రతి నాయకుడిగా నటించా. ఆ వేషంలో నన్ను మా ఆవిడ కూడా గుర్తుపట్టలేదు. అలాగే, త్వరలో రాబోయే ‘వేరుు అబద్ధాలు’ సినిమాలో విలన్‌గా నటించనున్నా. హీరోగా మా అబ్బాయి మా అబ్బాయి చిరంజీవి కృష్ణంరాజు(కృష్ణ) రెండు సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. మంచి ఫిజిక్ ఉంది. డ్యాన్సర్‌గా బాగా తర్ఫీదు పొందాడు. ‘లక్ష్మీదేవి సమర్పించు నేడే చూడండి’, ‘నాకైతే నచ్చింది’ సినిమాలు ఈ నెలాఖరున విడుదల కానున్నారుు. మరువలేని అక్కినేని మెచ్చుకోలు 1988లో స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు, రాధ కాంబినేషన్లో ‘వసంతగీతం’ అనే సినిమాలో వేషం వచ్చింది. షూటింగ్ స్పాట్లో ఏఎన్నార్‌ను చూడగానే డైలాగ్ బయటకు రాలేదు. ఆ సమయంలో ‘నీ వాయిస్ బాగుంది’ అని అక్కినేని మెచ్చుకోగానే నాలోని నటరాజు విజృంభించాడు. ఆయనే స్వయంగా చప్పట్లు కొట్టి అభినందించారు. పరోపకారమే ఆస్తి నాన్నకు 1987లో పక్షవాతం వచ్చింది. సినిమాలకు రెండేళ్లు దూరమయ్యా. ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. అన్ని ఇబ్బందుల్లో కూడా నాన్న నేర్పిన పరోపకారం చేసేవాడ్ని. ఇది చచ్చేంత వరకు అమలు చేస్తాను. ‘ఆగడు’లో కనిపిస్తా.. త్వరలో విడుదలకానున్న ఆగడు సినిమాలో నటించాను. అలాగే కరెంట్‌తీగ, ఎన్టీఆర్ ఆర్ట్స్ సినిమాల్లో చేస్తున్నాను. ఇప్పటివరకు 300కుపైగా సినిమాల్లో నటించాను. సీరియల్‌కు మాత్రం బెస్ట్ హీరోగా నంది అవార్డు వచ్చింది. హాస్యానికి రేలంగి అవార్డు లభించింది.