సాక్షి, విజయవాడ: అఖిల భారత కిసాన్ సభ మాజీ ఉపాధ్యక్షులు కొల్లి నాగేశ్వరరావు మృతి తీరని లోటని ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అన్నారు. మాచవరంలోని కొల్లి నాగేశ్వరరావు కుటుంబ సభ్యులను ఆయన సోమవారం పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతాంగ సమస్యలపై నాగేశ్వరరావు చేసిన పోరాటాలు మరువలేనివన్నారు. జల వనరులపై అపార అనుభవం కలిగిన ఆయన చివరి నిముషం వరకు రైతు సంక్షేమానికి కృషిచేశారని కొనియాడారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
తొలుత కొల్లి నాగేశ్వరరావు చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొల్లి నాగేశ్వరరావు కుమార్తె, ప్రముఖ వైద్యురాలు డాక్టర్ ప్రశాంతి, భార్య టానియా, అల్లుడు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు టి. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డితో కొల్లి నాగేశ్వరరావుకు ఉన్న అనుబంధం, ఆయన రాసిన పుస్తకాలను లక్ష్మణరెడ్డికి వివరించారు. ఆయన వెంట చైతన్య గ్రామీణ గోదావరి బ్యాంకు చీఫ్ మేనేజర్ పి.వీరారెడ్డి, ప్రభాకర్ రెడ్డి తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment