కోళీకోడ్‌ ఘటన: ‘షాక్‌కు గురయ్యా’ | Bangladesh Foreign Minister Said Deeply shocked About Air India Accident | Sakshi
Sakshi News home page

కోళీకోడ్‌ ఘటన తీవ్రంగా బాధిస్తోంది: ఏకే మోమెన్‌

Published Sat, Aug 8 2020 4:49 PM | Last Updated on Sat, Aug 8 2020 5:04 PM

Bangladesh Foreign Minister Said Deeply shocked About Air India Accident - Sakshi

ఢాకా: కేరళలోని కోళీకోడ్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై బంగ్లాదేశ్‌ విదేశాంగ శాఖ మంత్రి ఏకే మోమెన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రాణాల కొల్పోయిన మృతుల కుటుంబాలకు ఆయన శనివారం సంతాపం వ్యక్తం చేశారు. ‘కేరళలోని కోళీకోడ్‌ ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదం విని షాక్‌కు గురయ్యా. ఈ విషాద ఘటన నన్ను తీవ్రంగా బాధిస్తోంది. ఈ విమాన ప్రమాదం ఎంతమంది విలువైన ప్రాణాలను బలికొంది. వీరి ఆత్మలు ప్రశాంతంగా ఉండాలి, మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సంతాం తెలుపుతున్నాను. వారికి ఆ దేవుడు ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్న’ అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ జైశంకర్‌తో ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు  భారత అధికారులు పేర్కొన్నారు. (చదవండి: కోళీకోడ్‌ ఘటనపై స్పందించిన అశోక్‌)

క‌రోనా నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను వందే భారత్ మిషన్ ద్వారా స్వదేశానికి చేరవేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే  దుబాయ్ నుంచి కేరళలోని కోళీకోడ్ వస్తున్న ఎయిర్ ఇండియా విమానం క్యారిపూర్ విమనాశ్రయం వద్ద ల్యాండింగ్ అయ్యే సమయంలో రన్‌వేపై నుంచి పక్కకు జారి లోయలో పడి ప్రమాదానికి గురి అయ్యింది. ఈ ఘటనలో ఇద్దరూ పైలేట్‌లతో సహా 18 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం ప్రమాదానికి గల కారణాలపై ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్‌వెస్టిగేషన్‌ బ్యూరో(ఏఏఐబీ), డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సీవీల్‌ ఏవియేషన్‌(డీజీసీఏ) వారు దర్యాప్తు జరుపుతున్నారు. 
(చదవండి: రక్తమోడిన దృశ్యాలు, భీతిల్లిన చిన్నారులు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement