సాక్షి, గుంటూరు: ప్రముఖ కథా రచయిత, పాత్రికేయుడు శ్రీరమణ మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలియజేశారు. శ్రీరమణ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని ఒక ప్రకటనలో తెలిపారాయన.
ఆయన మానవత్వం, వ్యంగ్య రచనలు అందరినీ ఆకట్టుకున్నాయని, మిథునం లాంటి మంచి సినిమాకు రచయితగానే కాకుండా.. అనేక కథలతో అందర్నీ అలరించారని గుర్తు చేశారు సీఎం జగన్. అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీ రమణ.. మంగళవారం వేకువ ఝామున కన్నమూసిన సంగతి తెలిసిందే.
శ్రీరమణ స్వస్థలం గుంటూరు జిల్లా, వేమూరు మండలం వరహాపురం అగ్రహారం. పేరడీ రచనలకు పేరుగాంచిన కామరాజ రామారావు(శ్రీరమణ).. బాపు-రమణ(ముళ్ళపూడి వెంకటరమణ)లతో కలిసి పని చేశారు. పలు పత్రికలకు కాలమిస్ట్‌గా, సంపాదకుడిగా, నవలా రచయిత, సినీ రచయితగానూ ఆయన సాహిత్య రంగానికి సేవలందించారు. శ్రీ రమణ తన హస్య రచనకు గానూ 2014లో తెలుగు యూనివర్సిటీ నుంచి కీర్తి పురస్కారం స్వీకరించారు.
ఇదీ చదవండి: మిథునం రచయిత శ్రీరమణ కన్నుమూత
Comments
Please login to add a commentAdd a comment