
( ఫైల్ ఫోటో )
చల్లా భగీరథరెడ్డి అకాల మరణంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చురుకైన నేత.. మంచి రాజకీయ నేపథ్యం ఉన్న..
సాక్షి, తాడేపల్లి: చల్లా రామకృష్ణారెడ్డి కుమారుడు, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి (46) అకాల మరణంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భగీరథరెడ్డి ఎంతో చురుకైన నేత. మంచి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. ఆయన మృతి తీరని లోటు. చల్లా కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నా అని ఒక ప్రకటనలో సీఎం జగన్ పేర్కొన్నారు.
సంబంధిత వార్త: ఏపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి కన్నుమూత