
దేశమంతటా లాక్‌డౌన్ కొనసాగుతున్న వేళ జమ్మూకశ్మీర్‌లో భీకర ఎన్‌కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎదురుకాల్పుల్లో ఒక కల్నల్, ఒక మేజర్ స్థాయి అధికారి, ఇద్దరు జవాన్లతోపాటు పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఒకరు నేలకొరిగారు. పౌరుల ప్రాణాలు కాపాడి వీరమరణం పొందిన జవాన్ల కుటుంబానికి పలువురు ప్రముఖులు నివాళుర్పిస్తున్నారు. తాజాగా ప్రముఖ హీరో మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పించారు. (చదవండి : కల్నల్ సహా ఐదుగురు జవాన్ల వీరమరణం)
‘హంద్వారా దాడి.. మన దేశాన్ని దిగ్బ్రాంతికి గురిచేసింది. దేశాన్ని కాపాడటానికి మన సైనికులకు ఉన్న ధైర్యం, సంకల్పం చాలా ధ్రుడమైనవి. అది ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది. విధి నిర్వహణలో మరణించిన సైనికులకుజజ నిల్చుని మౌనం పాటించి నివాళులర్పిస్తున్నాను. ఎదురుకాల్పుల్లో మరణించినవారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ సమయంలో వారికి ధైర్యం, బలం ప్రసాదించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. జై హింద్’ అని మహేష్ బాబుపేర్కొన్నారు. కాగా, మహేష్ బాబు ఇటీవల నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో ఆర్మీ మేజర్ పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment