
అమెరికాలో వైద్య రంగంలో ముప్పై ఐదేళ్లుగా సేవలు అందించిన డాక్టర్ వాసుదేవ ప్రసాద్ అట్లూరి ఆకస్మిక మరణం పట్ల నార్ అమెరికా తెలుగు అసోసియేషన్ (నాట్స్) సంతాపం వ్యక్తం చేసింది. ముప్పై ఐదేళ్ల కిందట ఎంఎస్ చేయడానికి వచ్చిన వాసుదేవ ప్రసాద్ అరిజోనా యూనివర్సిటీ నుంచి ఎంఎస్‌తో పాటు పీహెచ్‌డీ పూర్తి చేశారు. అమెరికాలోనే స్థిరపడి ఎంతో మందికి సేవలు అందించారు. అనేక తెలుగు సంఘాల్లో క్రీయశీల పాత్ర పోషించారు.
అరిజోనాలోని ఫోనిక్స్‌లో నవంబరు 28న ఆయన ఆకస్మికంగా మరణించారు. ఆయన కుటుంబానికి నాట్స్ తరఫున ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు నాట్స్ పేర్కొంది.