
బాలాంత్రపు రజనీకాంతరావు.. ఇన్‌సెట్‌లో వైఎస్ జగన్
సాక్షి, నూజివీడు : ప్రముఖ రచయిత బాలాంత్రపు రజనీకాంతరావు మృతి పట్ల వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. తెలుగు సాహిత్య, కళ రంగాలకు ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నారు. తెలుగు తల్లి ముద్దు బిడ్డలో రజనీకాంతరావు అగ్రగణ్యులని వైఎస్ జగన్ అన్నారు. రేడియో జర్నలిజం ద్వారా కళల్ని, సాహిత్యాన్ని, లలిత సంగీతాన్ని సామాన్య ప్రజల్లోకి తీసుకెళ్లిన బాలాంత్రపు చిరస్మరణీయులని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
రజనీకాంత రావు మరణం తెలుగు సాహిత్య, కళా రంగాలకు తీరని లోటు అని అన్నారు. బాలాంత్రపు ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.