
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట సేనాని, పద్మ విభూషణ్ రావి నారాయణరెడ్డికి ఘన నివాళి అర్పించారు. ఆయన స్వగ్రామం బొల్లేపల్లి, బంజారాహిల్స్‌లోని రావి నారాయణరెడ్డి భవన్‌తో పాటు ఆయన నివాసంలో ఆయన కోడలు రావి ఊర్మిల, మనుమరాలు రావి ప్రతిభా రెడ్డిలు నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా ప్రతిభా రెడ్డి మాట్లాడుతూ..‘రావి నారాయణరెడ్డి స్వయంగా తన భూమిని దానం చేయటంతో పాటు అదే భూమి, భుక్తి, విముక్తి కోసం తెలంగాణ భూమి కోసం రైతాంగ పోరాటాన్ని నడిపిన తీరును జ్ఞాపకం చేసుకున్నారు. రావి నారాయణరెడ్డి, తెలంగాణ సాయుధ పోరాట గాధలను ఈ తరానికి తెలియచెప్పే దిశగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment