
నందమూరి హరికృష్ణ మానవీయ, సామాజిక విలువలు కలిగిన వ్యక్తి...
సాక్షి, హైదరాబాద్ : నందమూరి హరికృష్ణ పార్థీవ దేహానికి సినీ నటుడు, బీజేపీ నేత కృష్ణంరాజు నివాళులు అర్పించారు. హరికృష్ణతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు. సినీ, రాజకీయ రంగం ఓ గొప్ప వ్యక్తిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. హరికృష్ణ స్వయంకృషితో ఎదగాలనుకునే తత్త్వం కలవాడన్న కృష్ణంరాజు.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
తెలుగుదేశం పార్టీకి తీరని లోటు..
నందమూరి హరికృష్ణ మానవీయ, సామాజిక విలువలు కలిగిన వ్యక్తి అని సినీ నటుడు, దర్శకుడు ఆర్. నారాయణ మూర్తి అన్నారు. ఆయన మరణం సినీ పరిశ్రమకు, తెలుగుదేశం పార్టీకి తీరని లోటు అని సంతాపం వ్యక్తం చేశారు. హరికృష్ణ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు నారాయణ మూర్తి పేర్కొన్నారు.