సాక్షి, నల్లగొండ/ హైదరాబాద్ : నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. నల్లగొండ జిల్లా అన్నేపర్తి వద్ద బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డుప్రమాదంలో ఎన్టీఆర్ తనయుడు, రాజకీయ నాయకుడు, నటుడు హరికృష్ణ దుర్మరణం పాలయ్యారు. హరికృష్ణ నడిపిస్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడటంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే చికిత్స నిమిత్తం ఆయనను నార్కెట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు. ఈ ఘటనకు సంబంధించిన అప్‌డేట్స్ ఇవి:
- హరికృష్ణ భౌతికకాయానికి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నివాళులర్పించారు.
- హరికృష్ణ పార్దీవ దేహాన్ని సందర్శించేందుకు ప్రముఖులు, అభిమానులు పోటెత్తడంతో మెహిదీపట్నం సమీప ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మెహిదీపట్నం, బంజారాహిల్స్ రోడ్ నెం12ల్లో భారీ సంఖ్యలో వాహనాలు నిలచిపోయాయి. దీంతో పోలీసులు ట్రాఫిక్‌ను డైవర్ట్ చేస్తున్నారు. లక్డీకపూల్ నుంచి మెహిదీపట్నం వచ్చే వాహనాలను అయోధ్య జంక్షన్, బజార్‌ఘట్, అసీఫ్ నగర్ మీదుగా రావాలని, గచ్చిబౌలి నుంచి వచ్చే వాహనాలు టోలీ చౌకి ఫ్లై ఓవర్, ఫిల్మ్ నగర్, బీవీబీ, జూబ్లీహిల్స్ మీదుగా రావాలని సూచిస్తున్నారు.
Traffic going towards
— Anjani Kumar, IPS (@CPHydCity) August 29, 2018
1. Mehdipatnam from lakdikapool , Traffic diverted at
Ayodhya Jn, towards Bazarghat, Asif Nagar, Mehdipatnam.
2. Traffic coming from Gachibowli take left turn at Tolichowki flyover towards Film Nagar, BVB, Jubilee Hills. - హరికృష్ణ భౌతికకాయానికి సినీ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, రాంచరణ్‌లు నివాళులర్పించారు.
- రేపు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో హరికృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి. సాయంత్రం అంతిమయాత్ర ప్రారంభకానుంది. హరికృష్ణ భౌతికకాయానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే
- హరికృష్ణ పార్దీవ దేహానికి గవర్నర్ నరసింహన్ నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
- హరికృష్ణ భౌతికకాయానికి తెలంగాణ సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు నివాళులు అర్పించారు.
- హరికృష్ణ భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఆయన నివాసానికి భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. సీఎం సెక్యురిటీ సిబ్బంది, హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజన్ కుమార్ భద్రత చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
- హరికృష్ణ భౌతిక కాయం హైదరాబాద్ చేరుకుంది. మెహిదీపట్నంలోని ఆయన నివాసానికి తరలించారు.
160 కి.మీ వేగం.. వాటర్ బాటిల్ కోసం వెనక్కి తిరిగారు!
నందమూరి హరికృష్ణ దుర్మరణం పాలైన రోడ్డుప్రమాదానికి సంబంధించి పలు కీలక వివరాలను నల్లగొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ వెల్లడించారు. అతివేగమే హరికృష్ణ మృతికి కారణమని తెలిపారు. ప్రమాదం జరిగే సమయంలో ఫార్చునర్ కారు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతోందని, ఈ సమయంలో వాటర్ బాటిల్ కోసం కారును నడుపుతున్న హరికృష్ణ వెనక్కి తిరగడంతో ఒక్కసారిగా వాహనం అదుపు తప్పిందని ఆయన తెలిపారు. దీంతో డివైడర్‌ను ఢీకొట్టి 15 మీటర్ల దూరంలోకి కారు ఎగిరిపడిందని, డ్రైవింగ్ సీట్లో ఉన్న హరికృష్ణ 20 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డారని ఎస్పీ వివరించారు. సీటు బెల్ట్ పెట్టుకుంటే ప్రమాద తీవ్రత తగ్గేదన్నారు. ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.
- నటుడు, మాజీ మంత్రి హరికృష్ణ భౌతికకాయానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. గురువారం జరగనున్న అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని, ఈ విషయమై కుటుంబసభ్యులతో మాట్లాడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేసీఆర్ ఆదేశాలిచ్చారు.
ఉదయం :
- నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రి నుంచి రోడ్డుమార్గాన హైదరాబాద్‌కు హరికృష్ణ భౌతికకాయం తరలింపు..
- భౌతికకాయం వెంట చంద్రబాబునాయుడు, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, బాలకృష్ణ.. హైదరాబాద్‌లోని నివాసానికి హరికృష్ణ పార్థివదేహం తరలింపు
నందమూరి హరికృష్ణతోపాటు ఆయన కుటుంబసభ్యులకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో ఆయన చైతన్యరథాన్ని హరికృష్ణ స్వయంగా నడిపారు. ఇంట్లో పలువురు డ్రైవర్లు ఉన్నా.. స్వయంగా వాహనం నడపడానికే హరికృష్ణ ఇష్టపడేవారు. కానీ ఆ డ్రైవింగే నందమూరి కుటుంబంలో విషాదం నింపిన తీరుపై చదవండి: ఇష్టమైన డ్రైవింగే.. విషాదం నింపింది!
- హరికృష్ణ భౌతికకాయానికి పోస్టుమార్టం పూర్తి.. కాసేపట్లో హైదరాబాద్‌కు ఆయన పార్థివదేహం
- కామినేని ఆస్పత్రికి చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఉండవల్లి నుంచి హెలికాప్టర్‌లో వచ్చిన ముఖ్యమంత్రి
- కామినేని ఆస్పత్రిలో హరికృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించిన తెలంగాణ మంత్రి జగదీశ్‌రెడ్డి, టీ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నటుడిగా ఆయనది ఒక ప్రత్యేకమైన శైలి. ఎన్‌టీఆర్ తనయుడిగా సినిమాల్లోకి ప్రవేశించి.. హీరోగా, నిర్మాతగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తన ప్రత్యేకతను చాటుకున్నారు. ‘ఎవరి మాటా వినడు సీతయ్య’ అంటూ ప్రేక్షకులను అలరించారు. హరికృష్ణ సినీ కెరీర్‌పై ప్రత్యేక కథనం: ‘ఎవరి మాటా వినని సీతయ్య’
- కామినేని ఆస్పత్రికి చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ తండ్రి హరికృష్ణ భౌతికకాయాన్ని చూడగానే భోరున విలపించారు. తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక కన్నీరుమున్నీరయ్యారు. ఆస్పత్రిలోనే ఇద్దరు సోదరులు విలపించారు. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌తోపాటు బాలకృష్ణ, పురందేశ్వరి, ఇతర కుటుంబసభ్యులు కూడా ఆస్పత్రికి చేరుకున్నారు.
హరికృష్ణ పార్థీవదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్న వైద్యులు
- పోస్టుమార్టం తర్వాత హైదరాబాద్‌లోని నివాసానికి తరలింపు
- హైదరాబాద్‌లోని హరికృష్ణ నివాసానికి చేరుకుంటున్న కుటుంబసభ్యులు
- మొహనాబాద్‌లోని ఫాంహౌస్‌లో గురువారం అంత్యక్రియలు
అభిమానులకు హరికృష్ణ రాసిన ఆఖరి లేఖ.. కన్నీటిపర్యంతమవుతున్న ఫ్యాన్స్
- ‘సెప్టెంబర్ 2న నా 62వ పుట్టిన రోజు.. ఆ రోజు ఎటువంటి వేడుకలు జరుపవద్దు. మన రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో, కేరళలో వరదలు, వర్షాల కారణంగా ఎంతోమంది మరణించారు. వేల మంది నిరాశ్రయులైనారు. నా జన్మదిన వేడుకల కోసం చేసే ఖర్చుని బాధితుల కుటంబాలకు అందజేయండి. నిరాశ్రయులైన వారికి దుస్తులు, వంట సామాగ్రి, నిత్యావసర వస్తువులు మీ శక్తి మేరకు అందజేయండి’ అంటూ హరికృష్ణ తన అభిమానులకు చివరిలేఖ రాశారు. మరో నాలుగు రోజుల్లు జన్మదినం జరుపుకోవాల్సి ఉండగా.. అంతలోనే ఆయన తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన రాసిన లేఖ విడుదల కావడంతో అభిమానులు కన్నీటిపర్యంతమవుతున్నారు.
పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి:అభిమానులకు హరికృష్ణ ఆఖరి లేఖ
- ఆయన తెలుగు భాషాభిమాని.. రాజ్యసభలో తెలుగులో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని పట్టుబట్టిన నేత. తెలుగువారు ఐక్యంగా ఉండాలని సమైక్యాంధ్ర కోసం ఏంపీ పదవికి రాజీనామా చేసిన నాయకుడు. తెలుగు భాషను ప్రేమించిన హరికృష్ణ తెలుగు భాషా దినోత్సవం నాడే కన్నుమూయడంపై తెలుగు భాషాభిమానుల తీవ్ర ఆవేదన..
చదవండి:తెలుగు భాషా దినోత్సవం నాడే..
- నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రి వద్దకు చేరుకున్న హరికృష్ణ తనయులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్.. ఆస్పత్రి వద్ద విషాదఛాయలు
- శోకసంద్రంలో నందమూరి కుటుంబ.. నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి పెద్దసంఖ్యలో చేరుకుంటున్న అభిమానులు
- కామినేని ఆస్పత్రికి బయలుదేరిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ పురందేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు
- కాసేపట్లో కామినేని ఆస్పత్రికి బయలుదేరి వెళ్లనున్న ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, లోకేశ్ కుటుంబసభ్యులు
అతివేగమే కారణామా?
- పూర్తి భద్రతా ఫీచర్స్ ఉన్న ఫార్చునర్ కారులో హరికృష్ణ ప్రయాణించారు. అయితే, సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం.. అత్యంత వేగంగా వాహనాన్ని నడపడంతో కారు అదుపుతప్పి బోల్తా పడినట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో గంటకు 160 కిలోమీటర్ల వేగంగా హరికృష్ణ వాహనం నడుపుతున్నట్టు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. వాహనం మొదట డివైడర్‌ను ఢీకొట్టి.. అదుపు తప్పింది. రోడ్డుకు అటువైపు ఎగిరిపడి.. బోల్తా పడింది. ఈ ప్రమాదంలో హరికృష్ణ తలకు బలమైన గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. గతంలో ఇదే మార్గంలో ఆయన తనయుడు జానకీరామ్ స్వయంగా వాహనం నడుపుతూ.. ఇదే తరహాలో రోడ్డుప్రమాదంలో ప్రాణాలు విడిచారు.
హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తుండగా ప్రమాదం
- తెల్లవారుజామున 4.30 గంటలకు తానే డ్రైవ్ చేస్తూ బయలుదేరిన హరికృష్ణ
- ఏపీ28 బీడబ్ల్యూ 2323 కారులో నెల్లూరు జిల్లా కావలిలో ఓ వివాహానికి బయలుదేరిన హరికృష్ణ
- ప్రమాద సమయంలో కారులో హరికృష్ణతోపాటు ఇద్దరు వ్యక్తులు.. ప్రమాదంలో గాయపడ్డ వెంకట్రావు, అరికెపుడి శివాజీ
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment