ప్రపంచ కప్ చెస్ టోర్నమెంట్‌లో తెలుగు ఆటగాడు పెంటేల హరికృష్ణ ఆట ముగిసింది.
తిబిలిసి (జార్జియా): ప్రపంచ కప్ చెస్ టోర్నమెంట్‌లో తెలుగు ఆటగాడు పెంటేల హరికృష్ణ ఆట ముగిసింది. శుక్రవారం జరిగిన రెండో రౌండ్‌లో భారత్‌కే చెందిన సేతురామన్ చేతిలో హరికృష్ణ పరాజయం పాలయ్యాడు. ఇద్దరి మధ్య టైబ్రేక్‌లో రెండు ర్యాపిడ్ గేమ్‌లు జరిగాయి.
తొలి గేమ్ 58 ఎత్తుల్లో డ్రాగా ముగిసింది. అయితే రెండో గేమ్‌లో తీవ్ర ఒత్తిడికి లోనైన హరికృష్ణ స్వీయ తప్పిదాలతో 62 ఎత్తుల్లో పరాజయం పాలయ్యాడు.