![Hari Krishna Friend Arekapudi Shivaji Comments On Road Accident - Sakshi](/styles/webp/s3/article_images/2018/08/29/des.jpg.webp?itok=ZmVBZPoQ)
ప్రమాద స్థలం వద్ద పోలీసులు, స్థానికులు
హైదరాబాద్: నల్గొండ జిల్లా అన్నెపర్తి వద్ద ఈ రోజు(బుధవారం) ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో సినీ నటుడు, టీడీపీ నేత నందమూరి హరికృష్ణ మృతిచెందిన సంగతి తెల్సిందే. ప్రమాదం జరిగిన సమయంలో కారులో హరికృష్ణతో పాటు ఆయన స్నేహితులు అరికపూడి శివాజీ, వెంకట్రావులు కూడా ఉన్నారు. ప్రమాదంలో హరికృష్ణ చనిపోగా..ఆయన స్నేహితులు శివాజీ, వెంకట్రావులు గాయాలతో బయటపడ్డారు. ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.
అరికపూడి శివాజీ మీడియాతో మాట్లాడుతూ.. నెల్లూరు జిల్లాలో ఓ పెళ్లికి హాజరయ్యేందుకు ఉదయం నాలుగున్నర గంటలకు హైదరాబాద్ నుంచి కారులో బయలు దేరామని చెప్పారు. హరికృష్ణ కారు డ్రైవింగ్ చేస్తున్నారని వెల్లడించారు. ముందు సీట్లో తాను కూర్చున్నట్లు తెలిపారు. కారు రాయిపై ఎక్కడం వల్ల అదుపు తప్పిందని పేర్కొన్నారు. హరికృష్ణ సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో ప్రమాద సమయంలో కారులో నుంచి ఎగిరి బయటకు పడ్డారని చెప్పారు. తాము సీటు బెల్టు పెట్టుకోవడం వల్ల ప్రమాదం నుంచి బయటపడగలిగామని వెల్లడించారు. ప్రమాదం సమయంలో కారు వేగం 100 కిలోమీటర్ల వేగం ఉండవచ్చునని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment