
సాక్షి,నల్గొండ: రోడ్డుపై వెళ్తుండగా అకస్మాత్తుగా కారు టైర్ పంక్చర్ అయ్యి పల్టీలు కొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు.. ప్రకాశంజిల్లా పులికొండ గ్రామానికి చెందిన బొక్కముంతల కోటేశ్వర్ రావు నవీన దంపతులు తమ ఇద్దరి కూతుళ్ళతో కలసి వారి గ్రామం నుంచి స్విఫ్ట్ కారులో హైదరాబాద్‌కు పయనమయ్యారు.
రాళ్లవాగు తండా సమీపంలోకి రాగానే వారు ప్రయాణిస్తున్న కారు టైర్ పంక్చర్ అయ్యి పల్టీలు కొట్టింది. కోటేశ్వర్ రావు నవీనలు తీవ్రగాయాలుకాగా వారి కూతుళ్లలో పెద్దకుమార్తె త్రివేణికి స్వల్పగాయాలయ్యాయి. చిన్న కూతురు తన్విశ్రీ క్షేమంగా బయటపడింది. కారు పెద్ద ఎత్తున దెబ్బతిన్నప్పటికీ అదృష్టవశాత్తు వారికి ప్రాణాపాయం తప్పింది.
చదవండి: అంగన్వాడీ కార్యకర్త.. వామ్మో అవినీతి సొమ్ము అంత వెనకేసిందా!
Comments
Please login to add a commentAdd a comment