నందమూరి మల్టీ స్టారర్‌..? | Ntr and Harikrishna In Kalyan Ram Upcoming Movie | Sakshi
Sakshi News home page

Published Tue, Feb 20 2018 10:31 AM | Last Updated on Wed, Aug 29 2018 1:16 PM

Kalyan Ram Hari Krishna Ntr - Sakshi

కళ్యాణ్ రామ్‌, హరికృష్ణ, ఎన్టీఆర్‌

అక్కినేని ఫ్యామిలీ మల్టీ స్టారర్‌గా తెరకెక్కిన మనం సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ఆ సినిమా తరువాత చాలా మంది ఈ తరహా ఫ్యామిలీ మల్టీ స్టారర్‌లు చేసేందుకు ఇంట్రస్ట్‌ చూపించారు. కానీ సరైన కథలు దొరక్కపోవటంతో ఆ ప్రాజెక్ట్స్ తెర మీదకు రాలేదు. తాజాగా మరో ఆసక్తికర ఫ్యామిలీ మల్టీ స్టారర్‌ తెరమీదకు రానుందట. నందమూరి ఫ్యామిలీకి చెందిన ముగ్గురు స్టార్లు ఒకే సినిమాలో కలిసి నటించనున్నారన్న టాక్ వినిపిస్తోంది.

హీరోగా, నిర్మాతగా ఆకట్టుకుంటున్న నందమూరి కళ్యాణ్ రామ్‌.. ప్రస్తుతం ఎమ్మెల్యే, నా నువ్వే సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాల తరువాత పవన్‌ సాధినేని దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు అంగీకరించాడు. ఈ సినిమాను కళ‍్యాణ్ రామ్‌ తన సొంత నిర్మాణ సంస్థ ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్‌ సోదరుడు ఎన్టీఆర్‌, తండ్రి హరికృష్ణలు అతిథి పాత్రల్లో నటించనున్నారట. ఈ వార్తలపై చిత్రయూనిట్ ఇంతవరకు అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement