
నేతలు, ఉన్నతాధికారుల పిల్లలు ఎలా ఉంటారో.. ఎంతా బాధ్యతారహితంగా ప్రవర్తిస్తారో అందరికి తెలిసిన సంగతే. అందరూ అలా ఉండకపోయినా కొందరైనా తమ తల్లిదండ్రుల హోదాలను అడ్డుపెట్టుకుని ప్రభుత్వ అధికారులు.. సామాన్యుల మీద జులుం ప్రదర్శిస్తుంటారు. కానీ ఓ ముఖ్యమంత్రి కుమారుడు.. తానేవరో, తన తండ్రి హోదా ఏమిటనే విషయాలు వెల్లడించకుండా.. సాధారణ వ్యక్తిలాగా ట్రాఫిక్ పోలీసులు ఇచ్చిన చలానా చెల్లించిండంటే నమ్మడానికి కాస్తా కష్టంగానే ఉంటుంది. కానీ ఇది వాస్తవం. ఎందుకంటే ఆ వ్యక్తికి తండ్రి సీఎం అయినంత మాత్రాన కుమారులు తలబిరుసుగా.. అమర్యాదగా ప్రవర్తించకూడదని తెలుసు. అందుకే అంతా సాధరణంగా ఉండగలిగాడు.
ఆయనే నందమూరి హరికృష్ణ.. భేషజాలు తెలియని వ్యక్తిత్వం ఆయన సొంతం. ఈ ఆసక్తికర విషయాన్ని సంగీత దర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి తన ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. కీరవాణి... ‘ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు, ఒక సారి హరికృష్ణ ట్రాఫిక్ సిగ్నల్ దాటారు. దాంతో ట్రాఫిక్ పోలీసులు రాసిన చలానా కట్టి వెళ్లిపోయారు.. తప్ప తాను ఎవరో చెప్పలేదు’ అంటూ కీరవాణి, హరికృష్ణ గురించి తన ట్విటర్‌లో షేర్ చేశారు.
ఇంత గొప్ప వ్యక్తిత్వమున్న ఆ రథసారథిని మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కబళించింది. హరికృష్ణ మృతి ఆయన కుటుంబానికే కాక సినీ పరిశ్రమకు కూడా తీరని లోటు అంటున్నారు అభిమానులు.
రెండో వివాహాన్ని తండ్రి ఒప్పుకోలేదు
తండ్రి అంటే అపార గౌరవం ఉన్న హరికృష్ణ తండ్రికి ఇష్టం లేని పని ఒకటి చేశారంట. అది షాలినిని రెండో వివాహం చేసుకోవడం. హరికృష్ణ షాలిని(జూ ఎన్టీఆర్ తల్లి)ని వివాహం చేసుకోవడం ఆయన తండ్రి ఎన్టీఆర్‌కి నచ్చలేదు. కానీ హరికృష్ణ ఈ విషయంలో తండ్రితో కూడా విభేదించారు. అయితే జూ. ఎన్టీఆర్ పుట్టిన తర్వాత ఆ విభేదాలన్ని దూరమయినట్లు సమాచారం. అప్పుడు ఎన్టీఆరే స్వయంగా తన మనవడికి తన పేరు ‘నందమూరి తారక రామరావు’ అని పెట్టుకున్నారని మరో సినీ ప్రముఖుడు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment