హరికృష్ణకు మూడో స్థానం | The third place for Harikrishna | Sakshi
Sakshi News home page

హరికృష్ణకు మూడో స్థానం

Published Thu, Aug 3 2017 12:16 AM | Last Updated on Wed, Aug 29 2018 1:13 PM

హరికృష్ణకు మూడో స్థానం - Sakshi

హరికృష్ణకు మూడో స్థానం

బీల్‌ ఓపెన్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్‌ పెంటేల హరికృష్ణ మూడో స్థానం సంపాదించాడు. స్విట్జర్లాండ్‌లో బుధవారం ముగిసిన ఈ టోర్నీలో హరికృష్ణ 5.5 పాయింట్లు సాధించాడు. చివరిదైన తొమ్మిదో రౌండ్‌లో హరికృష్ణ తెల్లపావులతో ఆడుతూ 29 ఎత్తుల్లో ఎటెన్ని బాక్రోట్‌ (ఫ్రాన్స్‌) చేతిలో ఓడిపోయాడు.

ఈ టోర్నీలో హరికృష్ణకిదే తొలి ఓటమి కావడం గమనార్హం. ఐదు గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్న హరికృష్ణ, మరో మూడు గేముల్లో గెలిచాడు. 6.5 పాయింట్లతో బాక్రోట్‌ విజేతగా అవతరించగా... ప్రపంచ మహిళల చాంపియన్‌ హూ ఇఫాన్‌ (చైనా) 6 పాయింట్లతో రన్నరప్‌గా నిలిచింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement