
సాక్షి, హైదరాబాద్ : మాతృభాషపై మమకారం అధికంగా ఉండే నందమూరి హరికృష్ణ వేదిక ఏదైనా అచ్చ తెలుగులో మాట్లాడటాన్ని ఆస్వాదించేవారు.రాజ్యసభలో తెలుగులో మాట్లాడే అవకాశం ఇవ్వలేదని హరికృష్ణ ధ్వజమెత్తిన సంగతిని పలువురు గుర్తుచేసుకుంటున్నారు.
తెలుగువారంతా కలిసి ఉండాలనే కాంక్షతో సమైక్యాంధ్ర కోసం రాజ్యసభ సభ్యత్వానికి హరికృష్ణ రాజీనామా చేశారు. తెలుగు భాషా దినోత్సవం రోజున తెలుగు భాషను అమితంగా ప్రేమించే హరికృష్ణ మరణించడం బాధాకరమని భాషా ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment