‘ఫిడే’ గ్రాండ్ ప్రి టోర్నమెంట్‌ను భార త గ్రాండ్ మాస్టర్ పెంటేల హరికృష్ణ జాగ్రత్తగా ప్రారంభించాడు.
మాస్కో: ‘ఫిడే’ గ్రాండ్ ప్రి టోర్నమెంట్‌ను భార త గ్రాండ్ మాస్టర్ పెంటేల హరికృష్ణ జాగ్రత్తగా ప్రారంభించాడు. శుక్రవారం జరిగిన తొలి రౌం డ్‌ను అతను ‘డ్రా’ చేసుకున్నాడు. నార్వే గ్రాండ్ మాస్టర్ జాన్ లడవిగ్ హ్యామర్‌తో జరిగిన ఈ గేమ్ హోరాహోరీగా 92 ఎత్తుల పాటు సాగడం విశేషం. తెల్లపావులతో ఆడిన హరిని హ్యామర్ దీటుగా నిలువరించాడు. మిడిల్ గేమ్‌లో హరికృష్ణకు కొన్ని అవకాశాలు వచ్చినా, ప్రత్యర్థి తప్పించుకోవడంలో సఫలమయ్యాడు.