
హరికృష్ణతో కామినేని ఆసుపత్రి సిబ్బంది సెల్ఫీ
సాక్షి, నల్గొండ : నటుడు, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రమాదం అనంతరం ఆయన్ని నార్కట్‌పల్లి కామెనేని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. అయితే ఆసుపత్రిలో పనిచేసే సిబ్బందిలో కొందరు హరికృష్ణ పార్దీవదేహంతో సెల్ఫీలు దిగారు. అంతటితో ఆగకుండా సోషల్‌మీడియాలో షేర్ చేసి రాక్షసానందం పొందారు. దీంతో ఆగ్రహానికి గురైన నెటిజన్లు వారిపై దుమ్మెత్తిపోశారు.
కాగా, ఈ విషయంపై కామినేని ఆసుపత్రి వర్గాలు స్పందించాయి. హరికృష్ణ పార్దీవదేహంతో సెల్ఫీలు దిగిన వారిపై చర్యలు తీసుకుంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. తమ సిబ్బందిలో కొంతమంది చేసిన తప్పిదం వల్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిందని పేర్కొంది. సిబ్బందిలో కొందరి అనాగరిక, అమానుష ప్రవర్తన వల్లే ఈ తప్పిందం జరిగిందనీ, హరికృష్ణ కుటుంబ సభ్యులకు, అభిమానులకు ఆసుపత్రి తరపున క్షమాపణలు తెలిపింది.

ఆసుపత్రి వర్గాలు విడుదల చేసిన ప్రకటన
Comments
Please login to add a commentAdd a comment