
నేడు(బుధవారం) దివంగత నటుడు నందమూరి హరికృష్ణ 64వ జయంతి. ఈ సందర్భంగా తండ్రిని తలుచుకుని హీరో జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. ట్విటర్ వేదికగా తండ్రికి నివాళులు అర్పించారు. "ఈ అస్థిత్వం మీరు. ఈ వ్యక్తిత్వం మీరు. మొక్కవోని ధైర్యంతో కొనసాగే మా ఈ ప్రస్థానానికి నేతృత్వం మీరు. ఆజన్మాంతం తలుచుకునే అశ్రుకణం మీరే - నందమూరి కళ్యాణ్ రామ్, నందమూరి తారక రామారావు" అంటూ మనసులోని భావాలను వ్యక్తీకరించారు. (ఆర్‌ఆర్‌ఆర్: ‘క్లైమాక్స్ అద్భుతం..!’)
'మీ 64వ జయంతిన మిమ్మల్ని స్మరించుకుంటూ.... మిస్ యూ నాన్న'! అని ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు. కళ్యాణ్ రామ్ కూడా బాధాతప్త హృదయంతో తండ్రిని స్మరించుకున్నారు. కాగా నందమూరి తారకరామారావు వారసుడిగా అటు నటుడిగానూ, ఇటు రాజకీయ నాయకుడిగానూ హరికృష్ణ అందరి మన్ననలు అందుకున్నారు. వెండితెరపై సీతయ్యగా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. నేడు ఆయన జయంతిని పురస్కరించుకుని పలువురు ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. కాగా 2018లో జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మరణించిన విషయం తెలిసిందే. (మీ మరణంతో నా జీవితంలో శూన్యం)
మీ 64వ జయంతి న మిమ్మల్ని స్మరించుకుంటూ.... Miss You Nanna! pic.twitter.com/GG11AnPbIY
— Jr NTR (@tarak9999) September 2, 2020
Comments
Please login to add a commentAdd a comment