![Nandamuri Harikrishna Accident Visuals At Nalgonda District - Sakshi](/styles/webp/s3/article_images/2022/06/30/Nandamuri-Harikrishna.jpg.webp?itok=qzwq26Bi)
సాక్షి, నల్గొండ: నల్గొండ జిల్లా అన్నెపర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటుడు హరికృష్ణ మృతి చెందిన సంగతి తెలిసిందే. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయి డివైడర్‌ను ఢీకొట్టిన హరికృష్ణ వాహనం గాల్లో పల్టీలు కొడుతూ 30 అడుగుల దూరంలో పడిపోయింది. కారు గాల్లో ఉన్నప్పుడే హరికృష్ణ అందులో నుంచి బయటపడ్డట్టుగా తెలుస్తోంది. ప్రమాదం జరిగన తరువాత హరికృష్ణ కొన ఊపిరితో రోడ్డుపక్కన పడివున్న వీడియో వైరల్‌గా మారింది. హరికృష్ణ ముఖం నిండా రక్తంతో, తన చేయిని కదిలిస్తున్న దృశ్యాలు చూసి అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. కొందరు స్థానికుల ఒక పక్కపై పడివున్న హరికృష్ణ వెనుక భాగంలో నల్లటి దుప్పటి లాంటి దాన్ని ఉంచారు.
ఆ తర్వాత హరికృష్ణను నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించగా.. ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సీటు బెల్ట్ పెట్టుకోకపోవడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. హరికృష్ణతో పాటు కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరికి గాయాలయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment