హరికృష్ణ రెండో రౌండ్ గేమ్ ‘డ్రా
జెనీవా (స్విట్జర్లాండ్): ‘ఫిడే’ గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ రెండో గేమ్‌ను ‘డ్రా’గా ముగించాడు. మైకేల్ ఆడమ్స్(ఇంగ్లండ్)తో శుక్రవారం జరిగిన రెండో గేమ్‌లో తెల్లపావులతో ఆడిన హరికృష్ణ 38 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు.
అంతకుముందు గురువారం జరిగిన తొలి రౌండ్ గేమ్‌లో హరికృష్ణ 84 ఎత్తుల్లో అలెగ్జాండర్ రియాజనెత్సెవ్ (రష్యా)పై గెలుపొందాడు.